Kiraak RP fires on negative comments on Nellore Pedda Reddy Chepala Pulusu - Sakshi
Sakshi News home page

Kirak RP: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తు‍న్నారు.. ఇది పెయిడ్‌ బ్యాచ్ పనే: కిరాక్‌ ఆర్పీ

Published Tue, Feb 7 2023 12:55 PM | Last Updated on Tue, Feb 7 2023 1:14 PM

Kirak RP Fires On Negative Comments on Nellore Pedda Reddy Chepala Pulusu - Sakshi

కామెడి స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే కిర్రాక్‌ ఆర్పీ సందడి బుల్లితెరపై కరువైంది. ప్రస్తుతం షో మానేసి సొంతం బిజినెస్‌ పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో కర్రీ పాయింట్‌ ప్రారంభించాడు. ఈ బిజినెస్‌కు  ఊహించినదానికన్నా ఎక్కువ స్థాయిలో హిట్‌ అయ్యింది. పెద్ద సంఖ్యలో కర్రీ పాయింట్‌కు జనాలు పోటెస్తారు. దీంతో ఆ ప్రాంతం ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడటంతో ఆ మధ్య తాత్కాలికంగా కర్రీ పాయింట్‌ను క్లోజ్‌ చేశాడు. అయితే స్పెషలిస్ట్‌లతో తన కర్రీ పాయింట్‌ను తిరిగి ఓపెన్‌ చేశాడు.

చదవండి: వచ్చే వారం ప్రభాస్‌-కృతి సనన్‌ నిశ్చితార్థం? ట్వీట్‌ వైరల్‌

అయితే బిజినెస్‌ బాగా నడుస్తున్న క్రమంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు రుచి బాగాలేదంటూ ఈ మధ్య కొందరు ప్రచారం చేస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు ఆర్పీ. ఈ నేపథ్యంలో తన కర్రీ టేస్ట్‌ బాలేదంటూ వస్తున్న రూమర్లపై కిరాక్‌ ఆర్పీ మండిపడ్డారు. ఇదంత పనిగట్టుకోని చేస్తున్నారని, తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది పెయిడ్‌ బ్యాచ్‌ ఆసత్య ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆర్పీ మాట్లాడుతూ.. ‘ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనే. నా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. మోసం చేసి ఎన్నాళ్లు బిజినెస్ చేయలేరు. నేను తాను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాను’’ అన్నాడు. 

చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత

అలాగే ‘‘నేను ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎంతో మంది కస్టమర్లు రుచి చాలా బాగుందంటూ మరో పదిమంది కస్టమర్లను వెంటపెట్టుకొని మరీ వస్తున్నారు. ఎలాంటి రుచి లేకపోతే నా కర్రీ పాయింట్ వద్దకు ఎవరూ రారు. నేను పలు రకాల చేపలు పులుసు పెడుతున్నాను. అందరూ టేస్ట్ చూసి బాగుందని అంటుంటే.. ఒక్కడు బాగాలేదని నెగిటీవ్ కామెంట్ చేయడం అంటే ఆ వ్యక్తి ఎంత ఓర్వలేనివాడో అర్థం అవుతుంది. నా కిచెన్‌లో ఎన్నో వీడియోలు తీశాను.. అవే నా నిజాయితీని నిరూపిస్తాయి. నేను స్వయంగా నా కిచెన్ చూపిస్తూ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను. నేను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా. నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు. ఎంత నెగిటీవ్ చేస్తే.. నాకు అంత ప్రమోషన్’’ నెగిటివ్‌ కామెంట్స్‌ చేసేవారికి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement