Rocking Rakesh Shocking Comments On Kiraak RP Chepala Pulusu, Deets Inside - Sakshi
Sakshi News home page

Kirak RP-Rocking Rakesh: కిరాక్‌ ఆర్పీ చేపల పులుసు బిజినెస్‌ వారి భిక్షే: రాకింగ్‌ రాకేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Wed, Feb 8 2023 3:46 PM | Last Updated on Wed, Feb 8 2023 6:45 PM

Rocking Rakesh Shocking Comments on Kiraak RP Chepala Pulusu - Sakshi

కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొతంంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్‌ స్టార్ట్‌ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్‌ వస్తోంది. భారీ సంఖ్యలో కస్టమర్లు ఆర్పీ కర్రీ పాయింట్‌ ముందుకు క్యూ కడుతున్నాడు. ఫలితంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు బిజినెస్‌ లాభాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆర్పీ తన బిజినెస్‌ చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: కియారా-సిద్ధార్థ్‌ల సీక్రెట్‌ డేటింగ్‌, పెళ్లిపై కంగనా షాకింగ్‌ రియాక్షన్‌!

తాను నిజాయితిగా కర్రీ పాయింట్‌ నడిపిస్తున్నానని, ఎవరి ఎన్ని తప్పుడు ప్రచారం చేసిన అది తనకు ప్రమోషన్‌ అవుతుందంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అంతేకాదు ఓ పెయిడ్‌ బ్యాచ్‌తో తన కర్రీ పాయింట్‌పై ఆసత్య ప్రచారం చేయిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ ఆర్పీ గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. జబర్దస్త్‌ షోను నుంచి బయటకు వచ్చాక ఆర్పీ కర్రీ పాయింట్‌ పెట్టి ఫేమస్‌ అయ్యాడు కదా? దీనికి కారణం జబర్దస్త్‌ షోనే అంటారా? అని అడగ్గా.. ‘ఎవరికై సరే ఆ కామెడీ షో భిక్షే. ఎవరూ ఏం చేసిన కూడా అది జబర్దస్త్‌ భిక్షే’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: సుమంత్‌తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్‌ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఎప్పుడైన ఆయనను కలిశారా? అని అడగ్గా.. ‘లేదు.. అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు’ అంటూ పరోక్షంగా ఆర్పీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చాక ఆయన ఫుల్‌ ట్రోల్‌ చేశాడు. అక్కడ ఫుడ్‌ బాగుండదంటూ విమర్శలు చేశాడు. ఇప్పుడు వాటికి పుల్‌స్టాప్‌ కూడా పడింది. కానీ ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్‌ అంటారని అడగ్గా.. జనాలకు అంతా తెలుసని, ఎవరో ఏదో మాట్లాడారని.. అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే ఈ విలువైన సమయం వృధా అనుకుంటున్నానంటూ ఆసక్తికర షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు రాకేష్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement