
సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు నివసిస్తున్నాయి. అప్పుడప్పుడు కొన్ని జీవాలను చూసి ఆశ్చర‍్యపోతుంటాం. యూనిమేషన్ సినిమాలు, హాలీవుడ్, కార్టూన్ ఛానెళ్లలో వింత జంతువులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంటాం. అలాంటి జంతువులు నిజంగానే ఉన్నాయా అని అనుకుంటాం కదా..
తాజాగా అలాంటి ఘటనే ఒకటి నార్త్ అమెరికాలో వెలుగు చూసింది. సాధారణంగా మనం 50-100 కిలోల బరువున్న చేపలను చూసి ఉంటాం. కానీ, 10 అడుగులకు పైగా పొడువు, దాదాపు 500 పౌండ్ల నుంచి 600 పౌండ్ల బరువున్న చేపను చూశారా..? ఇంత సైజు, బరువు ఉన్న ఓ చేప( స్టర్జన్ ఫిష్) ఫ్రేజర్ నదిలో కనిపించింది. భయకరంగా ఉన్న ఆకృతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, ఈ స్టర్జన్ ఫిష్ వయసు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలమే ఉంటుందని అంచనా. స్టర్జన్ చేపలు జురాసిక్ యుగం నుంచి ఉంటున్నాయని, ఇవి బతికున్న డైనోసార్స్ అని నిపుణులు చెబుతుండటం విశేషం.
Giant. pic.twitter.com/K8w1yW6kek
— Jamie Gnuman197... (@JGnuman197) April 10, 2022
Comments
Please login to add a commentAdd a comment