బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్‌ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్‌ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్‌ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎంఆర్‌ఎఫ్‌ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్‌ఎఫ్‌ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)
ఇక మీదట బిఎస్‌ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్‌ఆర్‌ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment