హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ వంటకం కులు ట్రౌట్ ఫిష్ ఓసారి ట్రై చేయండి.
కులు ట్రౌట్ ఫిష్ తయారీకి కావలసినవి:
►ట్రౌట్ చేపలు – రెండు
►కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు
►నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు
►మెంతి ఆకులు – రెండు టీస్పూన్లు
►బరక మిరపపొడి – అరటీస్పూను
►ఉల్లిపాయ తరుగు – అరకప్పు
►ధనియాలు – రెండు టీస్పూన్లు
►నిమ్మతొక్క తరుగు – టీస్పూను
►ఆవనూనె – అరకప్పు
►ఉప్పు – రుచికి సరిపడా.
కులు ట్రౌట్ ఫిష్ తయారీ..
►ట్రౌట్ చేపలను శుభ్రంగా కడగాలి.
►కడిగిన చేపలకు మధ్యలో గాట్లు పెట్లాలి
►ధనియాలను దంచుకుని చేపలపై వేయాలి.
►వీటితో పాటు మెంతి ఆకులు, బరక మిరపపొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మతొక్క తరుగు, ఆవనూనె కొద్దిగా వేసి చేపలకు పట్టేలా అప్లై చేయాలి.
►దీనిని పదినిమిషాలపాటు నానబెట్టుకోవాలి
►నానిన ఫిష్‌ను గ్రీల్ లేదా డీప్ ఫ్రై చేసుకోవాలి
►ఇప్పుడు మిగతా ఆవనూనెను బాణలిలో వేసి వేడెక్కనివ్వాలి.
►కాగిన నూనెలో ఉల్లిపాయ తరుగు, ఆవాలు వేసి వేయించాలి.
►ఉల్లిపాయ రంగు మారాక స్టవ్ ఆపేసి నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి చక్కగా కలపాలి
►ఈ తాలింపు మిశ్రమాన్ని డీప్‌ఫ్రై చేసిన చేపలపై వేసి సర్వ్ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Babru And Tudkiya Bhath: గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు, ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్ ఇలా!
Nadru Yakhni: చపాతీ, అన్నంలోకి తామర పువ్వు కాడతో రుచికరమైన వంటకం! ఇలా
Comments
Please login to add a commentAdd a comment