ఆరు నెలలకే శిశువు జననం | The baby is born only six months | Sakshi
Sakshi News home page

ఆరు నెలలకే శిశువు జననం

Published Wed, Jun 28 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

ఆరు నెలలకే శిశువు జననం

ఆరు నెలలకే శిశువు జననం

తల్లీబిడ్డ క్షేమం
యర్రగొండపాలెంలో ఘటన


యర్రగొండపాలెం టౌన్‌: గర్భం దాల్చిన ఆరు నెలలకే ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  యర్రగొండపాలెం ప్రభుత్వాస్పత్రిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివీ..  యర్రగొండపాలెం పట్టణంలోని పడమటి బజారులో నివాసం ఉంటున్న 21 ఏళ్ల వివాహిత చాబోలు కుమారి రెండోసారి గర్భం దాల్చింది. ఆరు నెలల గర్భిణిగా ఉన్న కుమారి బలహీనంగా ఉండటంతోపాటు సోమవారం ఉదయం నుంచి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వైద్యాధికారి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ ఆమెను పరీక్షించి, ప్రసవానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. కొద్ది సేపటికే కుమారికి నొప్పులు అధికమయ్యాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు 900 గ్రాములు బరువుతో  ఆరోగ్యంగానే ఉన్నట్టు విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌నర్స్‌ కె.ప్రసన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement