
జనగామ ఆస్పత్రిలో ఐదుగురు శిశువుల జననం
సాక్షి, మహబూబాబాద్/ జనగామ: నాలుగేళ్ల కోసారి వచ్చే లీపు (ఫిబ్రవరి 29) శనివారం రోజున మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు, జనగామ ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు జన్మించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.ఉమారాణి, జిల్లా కేంద్రం బేతోలుకు చెందిన ఎస్.కే.ఫాతిమా, మరిపెడకు చెందిన బానోతు బులీలు మగశిశువులకు జన్మనిచ్చారు. అలాగే.. జనగామ మాతాశిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జయంతి, శాలూభాయ్, హాజిరా, అనిత, అనురాధ గర్భిణులకు ప్రసూతి చేశారు. జన్మించిన ఐదుగురిలో ఒక ఆడ శిశువు, నలుగురు మగ శిశువులు ఉన్నారు.
మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు శిశువుల జననం
సాక్షి, తిరుపతి: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో లీప్ ఏడాది ఫిబ్రవరి 29 శనివారం రోజున పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు.. తమ బిడ్డలను చూసుకుని మురిసిపోయారు. ఎవరికీ రాని అదృష్టం, గుర్తింపు తమ బిడ్డలకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇద్దరు శిశువుల జననం





Comments
Please login to add a commentAdd a comment