Leap year
-
లీప్ ఇయర్లో జన్మించిన నాటి ప్రధాని జీవితం సాగిందిలా..
‘మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్’.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఇందిరతో విభేదాల కారణంగా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ప్రారంభ జీవితం మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన తండ్రి తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్ అనేవారు. తనకు మతంపై విశ్వాసం ఉందని చెప్పేవారు. మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు. రాజకీయ జీవితం 1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1952లో మొరార్జీ.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) ముఖ్యమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయినప్పుడు, అంటే 1967లో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా, హోంమంత్రిగా పని చేశారు. 1977లో ప్రధానిగా.. నవంబర్ 1969లో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో జనతా పార్టీలో చేరారు. 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్‌కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు మొరార్జీ దేశాయ్ భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ను అందుకున్నారు. మొరార్జీ దేశాయ్ గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. అయితే దీనిలోకి క్షమాపణ స్ఫూర్తిని ఎప్పుడూ అంగీకరించలేదు. మొరార్జీ దేశాయ్ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వ్యక్తిగా పేరొందారు. -
ఫిబ్రవరి 29.. ప్రాధాన్యతలివే!
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 29 సంవత్సరంలో 60వ రోజు. సంవత్సరాంతానికి ఇంకా 305 రోజులు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 29వ తేదీన దేశ, ప్రపంచ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న పుట్టిన వారు ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును జరుపుకోలేరు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ పుట్టినరోజును జరుపుకోగలుగుతారు. ఫిబ్రవరిలో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారు. ఈ రోజు (ఫిబ్రవరి 29) భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జన్మించారు. ఇలా ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలను ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 29.. కొన్ని ముఖ్యమైన ఘటనలు 1504: క్రిస్టోఫర్ కొలంబస్ తన పశ్చిమ యాత్రలో జమైకాలో చిక్కుకుపోయాడు. స్థానికులను చంద్రగ్రహణం పేరుతో భయపెట్టి, తన బృందానికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. 1796: బ్రిటన్‌తో పాత వివాదాలకు స్వస్తి పలికిన జే ఒప్పందాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. 1856: రష్యా- టర్కియే మధ్య యుద్ధ విరమణ ప్రకటన 2000 - రష్యన్ దళాలు చెచ్న్యాలో 99 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రువాండా ప్రధాని పియర్ సెలెస్టిన్ రివిగేమా తన పదవికి రాజీనామా చేశారు. 2004 - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రికుడు మిచెల్ అలెగ్జాండర్ కల్లెరి అంతరిక్షంలో కాలు మోపారు. అయితే అతని స్పేస్ సూట్లోని లోపం కారణంగా స్టేషన్‌కి తిరిగి వచ్చాడు. 2004: ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ చలనచిత్రం అకాడమీ అవార్డ్స్‌లో 11 అవార్డులను గెలుచుకుంది. ఇది మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2008 - ప్రసిద్ధ సాహిత్యవేత్త డాక్టర్ బచ్చన్ సింగ్‌కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2008 - భారత సంతతికి చెందిన రిచా గంగోపాధ్యాయ 26వ అందాల పోటీలో మిస్ ఇండియా యూఎస్ఏ-2007 టైటిల్‌ను గెలుచుకుంది. ఫిబ్రవరి 29న పుట్టిన ప్రముఖులు 1932 – సిఎస్ శేషాద్రి (భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త) 1904 - రుక్మిణీ దేవి అరుండేల్ (ప్రముఖ భరతనాట్య నర్తకి) 1812 - టాస్మానియా నాయకుడు విల్సన్ కన్నుమూత. 1896 - మొరార్జీ దేశాయ్ (భారతదేశ మొదటి కాంగ్రెసేతర ప్రధాని) ఫిబ్రవరి 29న కన్నుమూసినవారు 1880 - సర్ జేమ్స్ విల్సన్ (టాస్మానియన్ రాజకీయ నేత) 1952 – కుష్వాహా కాంత్ (భారతదేశ ప్రసిద్ధ నవలా రచయిత) ఫిబ్రవరి 29 ముఖ్యమైన సందర్భాలు జాతీయ డీ అడిక్షన్ డే (మొరార్జీ దేశాయ్ పుట్టినరోజు) -
లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్ సంగతులు
Leap year 2024: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి 365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి, దాదాపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఒక రోజు వస్తుంది. అలా 366 రోజులు ఉండే సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటాం. అలా 2024 ఏడాదికి 366 రోజులుంటాయి. లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది? ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది అనుకున్నాం కదా! లీప్ సంవత్సరాన్ని నాలుగుతో భాగిస్తే శేషం ఖచ్చితంగా సున్నా వస్తుంది. కానీ 100తో కూడా భాగింపబడితే మాత్రం అది లీప్ సంవత్సరం కాదు. ప్రతీ ఏడాదిలా కాకుండా లీప్ ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి నాలుగేళ్లకొకసారి లీప్ డే ఉంటుందా? ఇంట్రస్టింగ్ లెక్కలు అయితే, ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ డే జోడించడదనీ, క్యాలెండర్‌ను 44 నిమిషాలు పొడిగింపు మాత్రమే ఉంటుందని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా, అంటే వేసవి నవంబర్‌లో వస్తుందని బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ బోధకుడు యూనాస్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్లకొకసారి లీప్ ఇయర్ వస్తుందనీ, 1700, 1800, 1900 సంవత్సరాల్లో లీప్ డే లేదని తెలిపారు. 2000 సంవత్సరంలో ఒక లీప్ డే ఉంది, ఎందుకంటే ఇది 100, 400 రెండింటితో భాగించబడే సంవత్సరం. అలాగే తరువాతి 500 సంవత్సరాలలో 2100, 2200, 2300 , 2500లో కూడా లీప్ డే ఉండదు. మళ్లీ 2028, 2032, 2036లో లీప్ డేస్ ఉంటాయి. లీప్ డే ఆలోచన కాలక్రమేణా క్యాలెండర్ మార్పు అభివృద్ధి చెందిందని నిపుణులు అంటున్నారు. లీప్ డే కలపపోతే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు, అంటే 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక నాలుగేళ్ల పాటు నాలుగు పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఫిబ్రవరిలో నెలలో పెట్టారు. ఈ లీప్ డే లేకపోతే, రైతులు సరైన సీజన్లో నాటడానికి ఇబ్బంది పడవచ్చంటారు ఖాన్. అంతేకాదు క్రిస్మస్ వేసవిలో వస్తుంది. అప్పుడు స్నో ఉండదూ.. క్రిస్మస్ ఫీలింగూ ఉండదు అంటారాయన. నాసా ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం 365 రోజుల కంటే దాదాపు ఆరు గంటలు ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకొకసారి ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులొస్తాయని నాసా చెబుతోంది. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్‌ను రూపొందించారు. ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అయనాంతం వంటి వార్షిక సంఘటనలకు నెలలు కనెక్ట్ అయ్యేలా చూసుకోవడానికి ఈ అదనపు రోజు ఉపయోగిస్తారని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. -
తెలుగు రాష్ట్రాల్లో ‘లీపు’శిశువులు
-
‘లీపు’ వీరులు వీరే!
సాక్షి, మహబూబాబాద్/ జనగామ: నాలుగేళ్ల కోసారి వచ్చే లీపు (ఫిబ్రవరి 29) శనివారం రోజున మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు, జనగామ ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు జన్మించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.ఉమారాణి, జిల్లా కేంద్రం బేతోలుకు చెందిన ఎస్.కే.ఫాతిమా, మరిపెడకు చెందిన బానోతు బులీలు మగశిశువులకు జన్మనిచ్చారు. అలాగే.. జనగామ మాతాశిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జయంతి, శాలూభాయ్, హాజిరా, అనిత, అనురాధ గర్భిణులకు ప్రసూతి చేశారు. జన్మించిన ఐదుగురిలో ఒక ఆడ శిశువు, నలుగురు మగ శిశువులు ఉన్నారు. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు శిశువుల జననం సాక్షి, తిరుపతి: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో లీప్ ఏడాది ఫిబ్రవరి 29 శనివారం రోజున పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు.. తమ బిడ్డలను చూసుకుని మురిసిపోయారు. ఎవరికీ రాని అదృష్టం, గుర్తింపు తమ బిడ్డలకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇద్దరు శిశువుల జననం -
శేషం ‘0’ వస్తే లీపు సంవత్సరమేనా?
ఏడాదికి 365 రోజులు.. ఏ రోజు.. ఏ పని చేయాలో మనలో చాలా మంది క్యాలెండర్లో టిక్ చేసుకుని పెట్టుకుంటారు... అదే లీప్ ఇయర్ అయితే.. ఏడాదిలో ఒక్కరోజు అదనంగా వచ్చి చేరుతుంది... 365 రోజుల క్యాలెండర్ కాస్తా 366 తేదీలతో కళకళలాడుతుంది.. ఈ ఏడాది ఆ ప్రత్యేకమైన రోజు శనివారం రావడంతో స్పెషల్ డే కాస్తా చాలామందికి హాలిడే అయిపోయింది. అయితేనేం నాలుగేళ్లకొకసారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎంజాయ్ చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ అరుదైన రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనే వారి ఆనందం రెట్టింపైంది. అంతేకాదు సర్చ్ ఇంజన్ గూగుల్.. ఈసారి ‘జంపింగ్ డూడుల్’తో లీప్ ఇయర్‌ను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా... అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి.. ఇది ఎప్పుడు మొదలైంది.. ఈ ఎక్స్ట్రా డే వెనుక ఉన్న వివరాలు కొన్నింటిని తెలుసుకుందాం. అందుకే 29 రోజులు మానవాళి మనుగడ సాగించే భూ గ్రహం.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపు 365.2422 రోజుల సమయం పడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో 365 రోజుల కాలాన్ని సాధారణంగా ఒక సంవత్సరంగా పేర్కొంటారు. అయితే, 365 మీద ఉన్న 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే, ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. ఇదంతా కలిసి, నాలుగేళ్లకు 24 గంటలు అంటే ఒక రోజు అవుతుంది. అలా మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్లో చేర్చుతారు. ఇలా అదనపు రోజు వచ్చిన ఏడాదిని లీపు సంవత్సరంగా పిలుస్తారు. అందుకే, సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. లీపు సంవత్సరంలో 29 రోజులుంటాయి. రోమన్ చక్రవర్తి జూలియన్ సీజర్ కాలంలో లీపు సంవత్సరం ప్రారంభమైంది. క్యాలెండర్ ప్రవేశపెట్టిన తర్వాత.. క్రీస్తు పూర్వం 45లో జూలియన్ సీజర్ నాలుగేళ్లకోసారి.. ఈ అదనపు రోజును క్యాలెండర్లో చేర్చాడు. అయితే క్రీస్తుశకం 1582లో జూలియన్ క్యాలెండర్ రూపకల్పనలో పదిరోజుల వ్యత్యాసం రావడంతో.. పోప్ గ్రెగరీ 13 కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. అందులో ఒకరోజు అధికంగా వచ్చే సంవత్సరానికి ‘లీప్ సంవత్సరం’గా నామకరణం చేశాడు. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ చేర్చి దానిని అధికారికంగా క్యాలెండర్లో చేర్చాడు. శేషం 0 అయితే లీపు సంవత్సరమేనా? నాలుగుతో భాగిస్తే శేషం 0 వచ్చే సంవత్సరం లీపు ఇయర్ అవుతుందని చాలామంది భావిస్తారు. అయితే శేషం వచ్చిన ప్రతీ ఏడాది లీప్ ఇయర్ కాదు. ఉదాహరణకు 2100ను 4తో భాగిస్తే శేషం 0 అయినప్పటికీ అది లీపు సంవత్సరం కాదు. ఎందుకంటే... మనం చెప్పుకొన్నట్లుగా భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. ఇందులో మనం 0.25 రోజు మిగులుతున్నట్లు పరిగణించాం. కానీ, నిజానికి 365.2422ను కచ్చితంగా లెక్కిస్తే.. అంతా కలిసి 400 ఏళ్లలో మూడు రోజులు అవుతాయి. అలా నాలుగు శతాబ్దాల్లోని మూడు రోజుల వ్యత్యాసం భర్తీ అయ్యేక్రమంలో.. మూడు లీపు సంవత్సరాలు మిస్సవుతాయి. ఇక ఫిబ్రవరి 29న జన్మించిన వారిని లీప్ లింగ్స్ లేదా లీపర్స్ అని పిలుస్తారు. వీరు అందరిలా ఏడాదికోసారి కాకుండా.. నాలుగేళ్లకు ఓసారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. మనిషి సగటు ఆయుష్షు 60 ఏళ్లు అనుకుంటే వీరు కేవలం 15సార్లు మాత్రమే బర్త్‌డే కేక్ కట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం పైన చెప్పుకొన్నట్లు మిస్సైన మూడు లీపు సంవత్సరాల్లోని ఏడాదిలో వస్తే మరో బర్త్‌డే సెలబ్రేషన్ కూడా మిస్సవుతారు. వాతావరణ పరంగా లీప్ ఇయర్లో గుర్తుంచుకోదగిన రోజులు హాటెస్ట్ లీప్డే: 1940(టెక్సాస్‌లోని పలు ప్రాంతాల్లో 100 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలు) కోల్డెస్ట్ లీప్డే: 1956(-66 డిగ్రీ ఫారెన్హీట్లు, అలస్కా) వెట్టెస్ట్ లీప్డే: 1984(21 ఇంచుల వర్షపాతం- హవాయి) స్నోయియెస్ట్ లీప్డే: 1944(33 ఇంచుల హిమపాతం- కాలిఫోర్నియా) -
లీప్ ఇయర్..సంథింగ్ స్పెషల్ డే
-
లీప్ ఇయర్..సమ్‌థింగ్ స్పెషల్
కుత్బుల్లాపూర్: నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ప్రత్యేకమైన సంవత్సరం.. ఏడాదికి 365 రోజులకు గాను ఒక్క రోజు అదనంగా చేరి కేలెండర్లో 366 రోజులు కనిపించే ఏకైక సంవత్సరం. ఏడాదికి ఉన్న రోజులలో అదనంగా ఒక రోజు చేరిన సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటారు. ఈ సంవత్సరం (2020) లీప్ ఇయరే.. లీప్ ఇయర్ ఆ సంవత్సరంలో పుట్టే వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్నో అపోహలు.. నమ్మకాలు.. లీప్ ఇయర్ కొందరికి ప్రత్యేకంగా ఉంటే కొందరిలో అపోహలు మరికొందరిలో నమ్మకాలు కలిగిస్తుంది.. 2012లో వచ్చిన లీప్ ఇయర్ అనంతరం అదే ఏడాది డిసెంబరు 21న ప్రళయం వస్తుందని, భూమి వినాశనం తప్పదని కొందరు భావించారు. అదే తరహాలో ప్రచారం కూడా తీవ్రస్థాయిలో జరిగింది. ఇదే విధంగా ప్రతి లీప్ సంవత్సరంలో అనేకానేక అపోహలు ప్రజలలో కలుగుతున్నాయి. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం లీప్ ఇయర్ అందరికి కలిసి వస్తుందని, లీప్ ఇయర్లో ప్రత్యేకంగా వచ్చి చేరే ఫిబ్రవరి 29వ తారీఖు విశేషంగా భావిస్తారు. ఈ రోజున పుట్టిన వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారనేది నమ్మకం. కాని కొందరు చెప్పేది ఏమిటంటే లీప్ ఇయర్లో ఒక రోజు మాత్రమే అదనంగా వచ్చి చేరుతుందని ఇంకెలాంటి విశేషం ఉండదని చెబుతారు. అసలేంటిఈ లీప్ఇయర్.. ప్రతి ఏడాది 365 రోజులు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఏడాది 365 రోజుల 6 గంటలు ఉంటుంది. 365 రోజలనే పరిగణలోకి తీసుకుని మిగిలిన ఆరు గంటలను ఏ విధంగా లెక్కించాలో మీమాంసలో ఏడాదికి మిగిలిపోయిన ఆరు గంటల సమయాన్ని నాలుగు సంవత్సరాల పాటు లెక్కించి వచ్చిన 24 గంటల సమయాన్ని ఒక రోజుగా గుర్తించడంతో ఫిబ్రవరి నెలలో 29వ తారీఖుగా పరిగణిస్తున్నారు. ఇలా ఫిబ్రవరి నెలలో అదనంగా వచ్చి చేరే ఒక రోజును లీప్ సంవత్సరంగా పిలుస్తుంటారు. ఆత్రుతగా ఎదురుచూస్తాం 1996 ఫిబ్రవరి 29వ మా విహాహం జరిగింది. 24 సంవత్సరాల మా దాంపత్య జీవితంలో ఆరు సార్లు పెళ్లి రోజులను జరుపుకున్నాం. నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మా పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి మాతో పాటు మా కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. ఈ సారి 2020లో వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. – శైలజ, సునీల్, జగద్గిరిగుట్ట ఫిబ్రవరి29న పుట్టిన వారు ప్రత్యేకం.. ముఖ్యంగా లీప్ సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29 ఆ రోజు ‘పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతరత్రా శుభాకార్యాలు జరిపిన వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫిబ్రవరి 29న పుట్టిన వారు నాలుగు సంవత్సరాలకు వచ్చే లీప్ సంవత్సరంలో వేడుకలు నిర్వహించుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. 2020 ఫిబ్రవరి 29న కొందరు గర్భీణీలు డెలివరీ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లీప్ ఇయర్లోనే పుట్టిన రోజు, వివాహం.. నేను పుట్టింది ఫిబ్రవరి 29.. నా ఎంగేజ్మెంట్ ఉమారాణితో అయింది ఫిబ్రవరి 29 నాడే. 2012 ఫిబ్రవరి 29న నా ఎంగేజ్మెంట్, మార్చి నెలలో వివాహం జరిగింది. అయితే మా వివాహ రోజు కన్నా ఫిబ్రవరి 29న నాడు జరిగిన ఎంగేజ్మెంటే నాకు ప్రత్యేకం. 2020లో నా పుట్టిన రోజుతో పాటు మరో వేడుక చేసుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నా. – శ్రవణ్, ఉమారాణి, చింతల్.. -
ఆ లక్కీ డాటర్స్ తో లాటరీ తగిలింది!
ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ అదృష్ట లక్ష్మీ ఇంటికొచ్చినట్టేనని చాలామంది భావిస్తారు. మరీ అలాంటి ఇద్దరు అదృష్ట లక్ష్ములు అత్యంత అరుదుగా వచ్చే ఒకే తేదీన జన్మిస్తే.. అంతకంటే ఆ తల్లిదండ్రులకు ఆనందం ఏముంటుంది. ప్రస్తుతం అమెరికాలోని వాయవ్య మిచిగన్‌కు చెందిన చాడ్, మెలిస్సా క్రాఫ్ దంపతులు ఇదే ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఈ దంపతులకు ఫిబ్రవరి 29 (లీపు సంవత్సరం) తెల్లవారుజామున 3.06 గంటలకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. వాస్తవానికి గర్భవతి అయిన మెలిస్సా క్రాఫ్ పదిరోజుల ముందే ప్రసవం కావాల్సి ఉంది. ప్రవసం ఆలస్యం కావడంతో నాలుగేళ్లకు ఓసారి వచ్చే లీపు సంవత్సరం రోజున ఆమె 'ఎవన్లీ జాయ్' అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకా అద్భుతమేమిటంటే సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే తేదీన ఆమె తన మొదటిబిడ్డకు జన్మనివ్వడం. ఈ దంపతుల పెద్దబిడ్డ ఎలియానా ఆడాయా 2012 ఫిబ్రవరి 29న.. అంటే లిపు సంవత్సరం నాడే జన్మించింది. 'ఇది నిజంగా నమ్మశక్యంగా అనిపించడం లేదు. పెద్ద లాటరీ తగిలినట్టు అనిపిస్తోంది. బేబీ లాటరీ మమ్మల్ని వరించింది' అని తల్లి మెలిస్సా ఆనందం వ్యక్తం చేసింది. పెద్దగా ప్రసవ వేదన పడకుండా, ఔషధాలు, సీజేరియన్ లేకుండా ప్రశాంతంగా ప్రసవం జరిగిందని ఆమె తెలిపింది. శనివారం పెద్ద కూతురు ఎలియానా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఆమె బంధువులు కూడా ఇది నిజంగా లాటరీ తగలడమే అంటున్నారు. నాలుగేళ్లకోసారి అది కూడా ఇద్దరు కూతుళ్ల బర్త్ డే ఒకేసారి చేయడమంటే లాటరీ తగలడమే కాదా? అని చమత్కరిస్తున్నారు. నిజానికి తోబుట్టువులు ఒకే తేదీన పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుంది. 1952-60 మధ్యకాలంలో కేవలం ఐదుగురు తోబుట్టువులు మాత్రమే ఒకే తేదీన జన్మించినట్టు గిన్నిస్ రికార్డులు చెప్తున్నాయి. -
ఈరోజు పుడితే తర్వాతి బర్త్‌డేకి మీ వయసెంత?
సంధ్యను అమితంగా ప్రేమించే గణేశ్ బర్త్ డేని వాళ్ల నాన్న ఘనంగా నిర్వహిస్తాడు. 'హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్లీ మళ్లీ..' అంటూ హిట్ పాట పాడిమరీ విషెస్ చెబుతాడు. గణేశ్ బర్త్ డే ప్రత్యేకతేంటంటే.. అతను లీపర్. అవును నాలుగేళ్ల కొకసారి మాత్రమే వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకునేవాళ్లను లీపర్స్ అంటారు. అసలింతకీ లీప్ సంవత్సరాలు ఎందుకొస్తాయి? వాటి విశిష్టత ఏంటి? తెలిసిన విషమేఅయినా లీపర్స్ కోసం మరోసారి ఆ అంశాలపై చిన్న లుక్కేద్దాం.. తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ దీర్ఘావృత్తాకార కక్ష్యలో తిరిగే భూమి.. ఒక పరిభ్రమణం పూర్తిచేయడానికి సరిగ్గా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. కచ్చితంగా చెప్పాలంటే 365.242199 రోజులన్నమాట. కానీ మనకు సంవత్సరంలో ఉన్నవి 365రోజులే. లెక్కింపునకు నోచుకోకుండా మిగిలిపోతోన్న ఆ నాలుగు పావురోజులను(కలిపితే ఒక ఒక రోజు) కలిపి లెక్కించేదే లీప్ ఇయర్! ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పుకుందాం.. దీర్ఘ వృత్తకార కక్ష్యలో తిరిగే భూమి.. సూర్యుడికి దగ్గరిగా ఉన్నప్పుడు ఎండాకాలమని, దూరంగా ఉన్నప్పుడు శీతాకాలామని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఈ ఏడాదిలో భూమి సూర్యుడికి అతి సమీపంగా ఉన్నది శీతాకాలంలోనే. జనవరి 2న సూర్యుడికి కేవలం 147,100,176 కిలోమీటర్ల దూరంలో భూమి ఉంది. దీన్నిబట్టి.. సూర్యుడికి దగ్గరగానో దూరంగానో ఉండటంవల్ల కాక 23.5 డిగ్రీల వంపు తిరిగి భూమి భ్రమణం చెందడం వల్లే రుతువులు ఏర్పడతాయని అర్థం చేసుకోవాలి. -
నాలుగేళ్ల సంబరం
'ప్రత్యేక రోజు' వేడుకలకు సిద్ధం ఫిబ్రవరి 29.. నాలుగేళ్లకోసారి వచ్చే రోజు. ఈ అరుదైన రోజున చోటు చేసుకొనే సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లీపు సంవత్సరం అందరికీ కామన్ అయినా, కొందరికి మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ రోజున వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు వీరు. బర్త్ డే, మ్యారేజ్ డేను ఘనంగా జరుపుకొనేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మరీ మనం కూడా వీరికి శుభాకాంక్షలు చెబుదామా..! రెండో పుట్టిన రోజు.. కమ్మర్పల్లి : మండలంలోని హాసాకొత్తూర్‌కు చెందిన వాల్గోట్ రమేశ్, లత దంపతుల రెండో కూతురు శ్రీనిత్య. 2008 ఫిబ్రవరి 29న జన్మించిన ఈ పాప ఇప్పటివరకు ఒకే పుట్టిన రోజును జరుపుకొంది. రెండో బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. మూడో బర్త్ డే ఆర్మూర్ : పెర్కిట్ గ్రామానికి చెందిన మంచిర్యాల సురేశ్, సంధ్యారాణి దంపతుల పెద్ద కుమారుడు లలిత్ చంద్ర. అందరిలా ఏడాదికోసారి కాకుండా నాలుగేళ్లకోసారి బర్త్ డే జరుపుకొంటాడు. 2004 ఫిబ్రవరి 29న జన్మించిన ఆయన ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే పుట్టినరోజు జరుపుకొన్నాడు. సోమవారం మూడో బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకొనేందుకు సిద్ధమయ్యాడు. లలిత్ చంద్ర తమ్ముడు జనవరి 1న జన్మించడం విశేషం. 32 ఏళ్లు.. ఏడో బర్త్ డే! ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన నారాయణ, శకుంతల దంపతుల కుమారుడు కుబీర్ శివానంద్ 1984 ఫిబ్రవరి 29న జన్మించాడు. 32 ఏళ్ల యువకుడైన ఇతను ఏడు సార్లు మాత్రమే జన్మదినాన్ని జరుపుకున్నాడు. బీవీఎన్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శివానంద్.. ఎనిమిదో జన్మదినాన్ని సోమవారం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బీవీఎన్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాడు. నాలుగేళ్లకోసారి వచ్చే జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నాడాయన. మొదటి పెళ్లి రోజు.. ఆర్మూర్ అర్బన్ : మాకు 2012 ఫిబ్రవరి 29న వివాహం జరిగింది. మాకు ఇద్దరు కుమారులు వినేశ్ సాయి, మోక్షిత్ సాయి. నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి పెళ్లి రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు వివాహం జరిగిన ఆలయంలో పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడానికి ప్రణాళిక చేసుకున్నాం. నాలుగు సంవత్సరాలకోసారి వచ్చే మా పెళ్లి రోజును ఘనంగా జరపడానికి మాకుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. - రాస ప్రసాద్, స్వర్ణలత, ఆర్మూర్ మర్చిపోలేని రోజు.. నాగిరెడ్డిపేట : అందరూ సంవత్సరానికి ఒక్కసారి పెళ్లిరోజు వేడుకలు జరుకుంటే మేము మాత్రం నాలుగేళ్లకు ఒకసారి పెళ్లిరోజు జరుపుకొంటాం. అందరికంటే భిన్నం గా ఉండాలనే ఫిబ్రవరి 29న పెళ్లి చేసుకున్నాం. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మా పెళ్లిరోజున ఉత్సాహంగా గడుపుతాం. పిల్లలతో కలిసి గుడికి వెళ్తాం. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లిరోజు వేడుకలను జరుపుకొంటాం. లీపు సంవత్సరం.. ఎవరూ మర్చిపోకుండా మా బంధువులంతా శుభాకాంక్షలు తెలుపుతారు. - బోయిని రాజశేఖర్, విజయలక్ష్మి, నాగిరెడ్డిపేట థ్రిల్లింగ్‌గా ఉంది మోర్తాడ్ : నా పేరు కొండ శంకర్. మాది తాళ్ల రాంపూర్. 1976 ఫిబ్రవరి 29న జన్మించా. నా వయస్సు 40 సంవత్సరాలు. కానీ, ఇప్పటివరకు 9 పుట్టిన రోజులే జరుపుకొన్నాను. ఇప్పుడు పదో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకొనేందుకు సిద్ధమయ్యా. అందరికి ఏడాదికి ఒకసారి పుట్టిన రోజు వస్తే నాకు మాత్రం నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. ఇది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రికార్డు ప్రకారం వయస్సు 40 ఏళ్లు అయినా జరుపుకొన్న పుట్టిన రోజులను పరిగణలోకి తీసుకుంటే నా వయస్సు నాలుగింతలు తగ్గుతుంది. అదృష్టమే..! బాన్సువాడ టౌన్ : ఈ అబ్బాయి పేరు దీక్షిత్‌కుమార్. బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, విఠల్‌చారి దంపతుల కుమారుడు. అందరిలాగే ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఉన్నప్పటికీ, 2004 ఫిబ్రవరి 29న జన్మించడం వల్ల ఆ కోరిక తీరకుండా పోయింది. అయితేనేం, మర్చిపోలేని రోజున జన్మించడం ఎంతో అదృష్టం చెబుతున్నాడు దీక్షిత్. నాలుగేళ్లకొకసారి వచ్చే పుట్టిన రోజును తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
హ్యాపీ డే
* లీపు సంవత్సరంలో పుట్టిన చిన్నారులు * నాలుగేళ్లకోసారి పుట్టినరోజు వేడుకలు శామీర్‌పేట్: అందరూ ఏడాదికోసారి పుట్టినరోజు చేసుకుంటే వాళ్లు మాత్రం నాలుగేళ్లకోసారి వేడుకలు జరుపుకుంటారు. అదేంటి అనుకుంటున్నారా? అంతేమరి.. ఎం దుకంటే వాళ్లు పుట్టింది లీపు సంవత్సరంలో కా బట్టి. శామీర్‌పేట్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంద రమేశ్, నర్సమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు (రేఖ, కావ్య, మానస). వారిలో పెద్దమ్మాయి ఎం.రేఖ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రేఖ 2000 సంవత్సరం ఫిబ్రవరి 29న (లీపు సంవత్సరం) పుట్టింది. ఇప్పటికి మూడుసార్లు మాత్రమే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరంలో పుట్టినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం వేడుకలు చేసుకొనే అవకాశం లేకుండా పోవడం కాస్త బాధగా ఉందని చెబుతోంది. తండ్రి రమేశ్ ఈ సంవత్స రం తన కూతురు రేఖ పుట్టిన రోజును ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి.. శామీర్‌పేట్ మండలం అంతాయిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, సంధ్య దంపతులు. వారి కుమార్తె కె. హర్షిత 29-02-2012 (లీపు సంవత్సరం)లో జన్మించింది. ప్రస్తుతంచిన్నారి తూంకుంటలోని శ్రీవిజ్ఞాన్భారతి స్కూల్లో నర్సరీ చదువుతోంది. మొదటి పుట్టిన రోజు వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ హన్మంతరెడ్డి వివరించారు. ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి.. ఘట్కేసర్: మండ ల పరిధిలోని రా జీవ్గృహకల్పకాల నీకి చెందిన యా దగిరి, సరిత దంపతులు. వారి కూతురు అఖిల 2008 ఫిబ్రవరి 29న జన్మించింది. ప్రస్తుతం రెండో పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైంది. అఖిల అదే కాలనీలోని న్యూవిజన్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.