హ్యాపీ డే
* లీపు సంవత్సరంలో పుట్టిన చిన్నారులు
* నాలుగేళ్లకోసారి పుట్టినరోజు వేడుకలు
శామీర్‌పేట్: అందరూ ఏడాదికోసారి పుట్టినరోజు చేసుకుంటే వాళ్లు మాత్రం నాలుగేళ్లకోసారి వేడుకలు జరుపుకుంటారు. అదేంటి అనుకుంటున్నారా? అంతేమరి.. ఎం దుకంటే వాళ్లు పుట్టింది లీపు సంవత్సరంలో కా బట్టి. శామీర్‌పేట్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంద రమేశ్, నర్సమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు (రేఖ, కావ్య, మానస). వారిలో పెద్దమ్మాయి ఎం.రేఖ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రేఖ 2000 సంవత్సరం ఫిబ్రవరి 29న (లీపు సంవత్సరం) పుట్టింది.
ఇప్పటికి మూడుసార్లు మాత్రమే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరంలో పుట్టినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం వేడుకలు చేసుకొనే అవకాశం లేకుండా పోవడం కాస్త బాధగా ఉందని చెబుతోంది. తండ్రి రమేశ్ ఈ సంవత్స రం తన కూతురు రేఖ పుట్టిన రోజును ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
నాలుగేళ్ల తర్వాత మొదటిసారి..
శామీర్‌పేట్ మండలం అంతాయిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, సంధ్య దంపతులు. వారి కుమార్తె కె. హర్షిత 29-02-2012 (లీపు సంవత్సరం)లో జన్మించింది. ప్రస్తుతంచిన్నారి తూంకుంటలోని శ్రీవిజ్ఞాన్‌భారతి స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. మొదటి పుట్టిన రోజు వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ హన్మంతరెడ్డి వివరించారు.
ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి..
ఘట్‌కేసర్: మండ ల పరిధిలోని రా జీవ్‌గృహకల్పకాల నీకి చెందిన యా దగిరి, సరిత దంపతులు. వారి కూతురు అఖిల 2008 ఫిబ్రవరి 29న జన్మించింది. ప్రస్తుతం రెండో పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైంది. అఖిల అదే కాలనీలోని న్యూవిజన్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.