Preity Zinta And Gene Goodenough: Welcome Twins Jai and Gia Through Surrogacy - Sakshi
Sakshi News home page

Preity Zinta: 46 ఏళ్లకు తల్లైన స్టార్‌ హీరోయిన్‌, కవలలకు జననం

Published Thu, Nov 18 2021 12:56 PM | Last Updated on Fri, Nov 19 2021 9:03 PM

Preity Zinta And Gene Goodenough Welcome Twins Jai and Gia Through Surrogacy - Sakshi

Actress Preity Zinta And Her Husband Gene welcome Twins Jai and Gia: ప్రముఖ బాలీవుడ్‌ నటి, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ప్రీతి జింటా(46) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కవలలకు ఆమె తల్లైనట్లు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. సరోగసి(అద్దె గర్భం) పద్దతిలో తాను, జీన్‌ తల్లిదండ్రులైనట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఇక విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిస్తూ పిల్లల పేర్లను కూడా వెల్లడించింది. భర్త జీన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న అంత్యంత సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్‌, నేను కవలలకు జన్మనిచ్చాం. 

చదవండి: రాశీ ఖన్నాకు బంపర్‌ ఆఫర్‌.. కరణ్‌ జోహార్‌ సినిమాలో ఛాన్స్‌..!

ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా కుటుంబంలోకి స్వాగతించాం. వారి పేర్లు జై జింటా, గియా జింటా నిర్ణయించాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అలాగే సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ప్రీతి జింటా కృతజ్ఞతలు తెలిపింది. కాగా అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్‌లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. 

చదవండి: నయన్‌కు సర్‌ప్రైజ్‌: విక్కీ బర్త్‌డే బ్యాష్‌ మామూలుగా లేదుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement