ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
ఎంజీఎం : ఒకే కాన్పులో ముగ్గు రు ఆడ శిశువులు జన్మించిన ఘటన వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం చోటు చేసుకుం ది. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన ఐత సంధ్యకు నెలలు నిండడంతో ఆస్పత్రి లో చేర్పించారు. ఈ మేరకు వైద్యులు సుధీర్, శ్రీవిద్య శనివారం ఆమెకు శస్త్రచికిత్స చేయగా ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆస్పత్రి సూపరింటెండెం ట్ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు శిశువులు కూడా రెండు కిలోలకు పైగా చొ ప్పున బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు.