ప్రఖ్యాత బ్రిటన్ గణిత శాస్త్రవేత్త జార్జ్ బూలే 200 వ జయంతి సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ని రూపొందించింది. డూడుల్లో ఆల్ జీబ్రాకు సంబంధించిన అంశాలు ప్రతిబింబించేలా ఈ డూడుల్ను తయారు చేయడం విశేషం. బూలే గణితంలోనే కాక ఫిలాసఫి, తర్కశాస్త్రంలో విశేష కృషి చేశారు. ఆయన రూపొదించిన బూలియన్ లాజిక్ను ప్రస్తుత సమాచార యుగానికి పునాదిగా భావిస్తారు.
ఆయన రాసిన 'ద మ్యాథమేటికల్ ఎనాలిసిస్ ఆఫ్ లాజిక్', 'ది లాస్ ఆప్ థాట్', 'ద ట్రిటీస్ ఆన్ ద కాలిక్యులస్ ఆప్ ఫినిట్ డిఫరెన్సెస్' అనే పుస్తకాలు గణిత రంగంలో ఆయన చేసిన కృషిని తెలియజేస్తాయి. బూలే సేవలకు గాను రాయల్ సొసైటీ ఆయన్ను రాయల్ మెడల్తో సత్కరించింది.