క్రీస్తు జననం.. క్రైస్తవుల పర్వదినం
క్రీస్తు జననం.. క్రైస్తవుల పర్వదినం
Published Sat, Dec 24 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
- జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు
- చర్చిలకు విద్యుత్ కాంతుల శోభ
కర్నూలు(టౌన్): క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని నిర్వహించుకునే క్రిస్మస్ సందడి మొదలైంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చర్చిలు విద్యుత్ దీప కాంతులతో శోభిల్లుతున్నాయి. వారం రోజులుగా ఆయా చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. చర్చిల్లో క్యాండిల్ లైటింగ్ సర్వీసు నిర్వహించారు.
అసలు క్రిస్మస్ అంటే....
క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన రోజు. బైబిల్‌లోని లేఖనాల ప్రకారం ఏసుక్రీస్తు 2016 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్లు క్త్రెస్తవులు విశ్వాసం. అందుకే ఏటా డిసెంబర్ 25న క్రెస్తవులు పండుగగా చేసుకుంటారు. ఏసుక్రీస్తు పుట్టుకను జ్ఞానులు నడిపించిన నక్షత్రాన్ని సూచనగా క్రిస్‌మస్ పండుగ రోజున ప్రతి ఇంటిపై క్రీస్తు జననాన్ని తెలియజేస్తు నక్షత్రాలను ఏర్పాటు చేస్తారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, రాక్‌వుడ్ మెమోరియల్ చర్చి, స్టాంటన్ చర్చి, గిప్సన్ చర్చి, సీఎస్‌ఐ తదితర చర్చిలను అందంగా అలంకరించారు. క్రీస్తు పుట్టుకను తెలియజేస్తూ పశువుల పాకను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి నుంచి అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆర్ధరాత్రి 12 గంటల వరకు ప్రార్థనలు చేసి హ్యాపి క్రిస్మస్‌లోకి అడుగిడిన తరువాత శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
క్రైస్తవ ప్రపంచానికి శుభోదయం: బిషప్ పూల ఆంథోని (సెయింట్ లూర్డ్సు క్యాథడ్రల్ చర్చి )
బాధాతప్త హృదయాలకు ఓదార్పునివ్వడానికి, చీకటి నిండిన బతుకులో వెలుగులు నింపడానికి రాజాధిరాజు దీనాతిధీనునిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం, క్రీస్తును అరాధించడం అనే ఆర్థాలున్నా.. మూలార్థం మాత్రం మార్పు. అదే సమ సమాజ స్థాపన. ఆ మరియ సుతుడు అపరాజితుల పక్షాన నిలిచేందుకే ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా వ్యా«ధులు, బాధల్లో ఉన్న వారి పక్షాన నిలుద్దాం. నవ సమాజాన్ని నిర్మిద్దాం.
ప్రేమ, కరుణే జీవిత సారాం«శం : డాక్టర్ రెవరెండ్ రత్నప్రభపాల్
క్రీస్తు పుట్టుక దేవుని ప్రత్యక్షతకు నిదర్శనం. పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించాడు. ఆయన సూచించిన సత్యం, ధర్మం, శాంతి, దయా మార్గంలో మనందరం నడవాలి. సర్వమానవాళికి ఆయన కల్పించిన రక్షణ మనకు పాప, మరణ భయముల నుంచి విముక్తి కలిగింది.
Advertisement
Advertisement