ఫేస్ బుక్ లో 'ఫకామాలో కిహె' వీడియో హల్ చల్! | Dad accidentally livestreams wife giving birth to the world via Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లో 'ఫకామాలో కిహె' వీడియో హల్ చల్!

Published Sat, May 21 2016 10:04 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఫేస్ బుక్ లో 'ఫకామాలో కిహె' వీడియో హల్ చల్! - Sakshi

ఫేస్ బుక్ లో 'ఫకామాలో కిహె' వీడియో హల్ చల్!

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి విషయానికి వస్తే ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ప్రతి చిన్న విషయాన్నీ చేతిలో రెడీగా ఉన్న సెల్ ఫోన్ తో  వీడియోలో బంధించడం, అది తమకో మంచి అనుభూతిగానో, గుర్తుగానో దాచుకోకుండా తమ ప్రతాపాన్నో, టాలెంట్ నో, అల్లరినో అందరికీ ప్రదర్శించచడం కోసం యూట్యూబ్ లో పోస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇదే నేపథ్యంలో సదరు వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఫేస్ బుక్  లో హల్ చల్ చేస్తోంది.

అమెరికాకు చెందిన ఫకామాలో కిహె ఎకి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో చూసి ఇప్పుడు ప్రపంచం నివ్వెరపోతోంది. ఫకామాలో తన భార్య ప్రసవ వేదనను, ప్రసవ సన్నివేశాన్ని మొత్తం వీడియో తీసి మురిసిపోవడమే కాదు... ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సోషల్ మీడియా వినియోగదారులకు, స్నేహితులకు లైవ్ స్ట్రీమ్ చూపించాడు. 45 నిమిషాలపాటు ఉన్న వీడియోను చూసిన అతడి ఫ్రెండ్స్, బంధువులు కొందరు అతడి భార్యకు అభినందనలు, ధైర్యం చెప్తుంటే మరి కొందరు ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement