livestreams
-
ఇక యూట్యూబ్‌లో షాపింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్స్ట్రీమ్స్కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్లో అవి ప్రత్యక్షం అవుతాయి. వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు. -
గేమ్‌లో ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. మితిమీరి తాగడంతో..
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తుంటారు. వివిధ స్టంట్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్ స్ట్రీమింగ్‌లో పోటీపడి పరిమితికి మించి మద్యంతాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి. ఇంతకూ ఎంత తాగాడో తెలిస్తే షాకవుతారు! చైనా షార్టు వీడియో ప్లాట్‌ఫామ్ 'డౌయిన్'(చైనా టిక్‌టాక్)లో ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ నడుస్తుంటాయి. మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఇందులో లైవ్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు కంటెండర్లు 'పీకే'అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఈ గేమ్‌లో ఓడిన వ్యక్తే జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన జూవా. గెలిచిన వ్యక్తి సాంక్యూజ్. గేమ్‌లో భాగంగా లైవ్‌లో జువా ముందు ఏడుబాటిళ్ల'బైజు'(చైనా ఓడ్కా)ను పెట్టాడు సాంక్యూజ్. గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‌లోనే ఏడుబాటిళ్ల 'బైజు'ను తాగాడు జువా. మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జువా ఎంత వైన్ తాగాడో సరిగ్గా తెలియదు.. కానీ రాత్రి లైవ్‌లో నాలుగో బాటిల్ తాగడం వరకు తనకు జ్ఞాపకం ఉందని తన స్నేహితుడు వెల్లడించాడు. జువా ఈ మధ్యే లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చేరాడని తెలిపాడు. 'బైజు' మద్యంలో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు. డౌయిన్ ప్లాట్ఫామ్లో 10లక్షల వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు రూ.28బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇదీ చదవండి:మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
ఫేస్ బుక్ లో 'ఫకామాలో కిహె' వీడియో హల్ చల్!
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి విషయానికి వస్తే ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ప్రతి చిన్న విషయాన్నీ చేతిలో రెడీగా ఉన్న సెల్ ఫోన్ తో వీడియోలో బంధించడం, అది తమకో మంచి అనుభూతిగానో, గుర్తుగానో దాచుకోకుండా తమ ప్రతాపాన్నో, టాలెంట్ నో, అల్లరినో అందరికీ ప్రదర్శించచడం కోసం యూట్యూబ్ లో పోస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇదే నేపథ్యంలో సదరు వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. అమెరికాకు చెందిన ఫకామాలో కిహె ఎకి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో చూసి ఇప్పుడు ప్రపంచం నివ్వెరపోతోంది. ఫకామాలో తన భార్య ప్రసవ వేదనను, ప్రసవ సన్నివేశాన్ని మొత్తం వీడియో తీసి మురిసిపోవడమే కాదు... ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సోషల్ మీడియా వినియోగదారులకు, స్నేహితులకు లైవ్ స్ట్రీమ్ చూపించాడు. 45 నిమిషాలపాటు ఉన్న వీడియోను చూసిన అతడి ఫ్రెండ్స్, బంధువులు కొందరు అతడి భార్యకు అభినందనలు, ధైర్యం చెప్తుంటే మరి కొందరు ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారు.