సాక్షి, బెంగళూరు: హిందూ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని హరిద్వార్‌లోని భారతమాత మందిర పీఠాధిపతి గోవింద్ దేవ్ గిరీజీ మహాదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ జనాభాను పెంచి భారత్ నుంచి ఏ ప్రాంతం విడిపోకుండా చూడొచ్చని అన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ధర్మ సంసద్ హిందూ సదస్సులో శనివారం ఆయన మాట్లాడారు.
‘ప్రస్తుతం హిందువులు, మనమిద్దరం.. మనకు ఇద్దరు అన్న రీతిలో ఆలోచిస్తుండటం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ జనాభా తగ్గిపోతోంది. దీంతో అక్కడ హిందూ ప్రాభవం మసకబారుతోంది. ఫలితంగా వారిలో భారత్ నుంచి విడిపోవాలనే భావన కలుగుతోంది. దీనికి పరిష్కారంగా ప్రతి హిందూ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలి. దాని వల్ల భౌగోళిక, ధార్మిక సమతుల్యత ఏర్పడుతుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment