hindu couple
-
హిందువులు నలుగురిని కని... ఇద్దర్ని ఆరెస్సెస్‌కు దత్తతివ్వండి
కాన్పూర్/లక్నో/సిమ్లా: భారత్ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలని సాధ్వి రితంబర కోరారు. వారిలో ఇద్దరిని దేశం కోసం కేటాయించాలన్నారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఆమె శనివారం నిరాలానగర్‌లో రామ్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ దంపతులు నలుగురిని కని వారిలో ఇద్దరిని ఆర్ఎస్ఎస్కు దత్తతకివ్వాలి. వీహెచ్‌పీ కార్యకర్తలుగా తయారు చేసి దేశానికి అంకితం చేయాలి’’ అన్నారు. ‘‘జనాభా అసమతుల్యత భవిష్యత్తులో దేశానికి మంచిది కాదు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకొస్తే ఈ సమస్య ఉండదు’’ అని చెప్పారు. అయోధ్య రామ మందిర ఉద్యమంతో సంబంధమున్న రితంబర వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని వ్యవస్థాపకురాలు. నర్సింగానంద్.. మళ్లీ అదే మాట భారత్ ముస్లిం దేశంగా మారకూడదంటే హిందువులు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని యతి నర్సింగానంద్, అఖిలభారత సంత్ పరిషత్ హిమాచల్‌ప్రదేశ్ ఇన్చార్జి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లా ముబారక్‌పూర్‌లో ‘ధర్మసంసద్’లో వారు మాట్లాడారు. ‘‘ముస్లింలు పథకం ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ జనాభాను పెంచుకుంటున్నారు. భారత్ ముస్లిం దేశంగా మారకుండా చూసేందుకు ఎక్కువ సంతానాన్ని కనాలని హిందూ దంపతులకు పిలుపునిస్తున్నాం’ అని సరస్వతి అన్నారు. ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలంటూ జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. యతి నర్సింగానంద్ ఇటీవల మథురలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. గతేడాది హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు. -
హిందువులు నలుగురిని కనాలి
సాక్షి, బెంగళూరు: హిందూ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని హరిద్వార్‌లోని భారతమాత మందిర పీఠాధిపతి గోవింద్ దేవ్ గిరీజీ మహాదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ జనాభాను పెంచి భారత్ నుంచి ఏ ప్రాంతం విడిపోకుండా చూడొచ్చని అన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ధర్మ సంసద్ హిందూ సదస్సులో శనివారం ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం హిందువులు, మనమిద్దరం.. మనకు ఇద్దరు అన్న రీతిలో ఆలోచిస్తుండటం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ జనాభా తగ్గిపోతోంది. దీంతో అక్కడ హిందూ ప్రాభవం మసకబారుతోంది. ఫలితంగా వారిలో భారత్ నుంచి విడిపోవాలనే భావన కలుగుతోంది. దీనికి పరిష్కారంగా ప్రతి హిందూ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలి. దాని వల్ల భౌగోళిక, ధార్మిక సమతుల్యత ఏర్పడుతుంది’ అని వివరించారు. -
ఆ హిందూ దంపతుల కూతురి పేరు.. 'యూనుస్'
ఒకవైపు రాజకీయ నాయకులు, కొందరు సెక్యులరిస్టులు అసహనం అంటూ గగ్గోలు పెడుతుంటే.. సామాన్యులు మాత్రం అదేమీ తమకు అక్కర్లేదని, తాము పరమత సహనంతోనే ఉన్నామని చాటి చెబుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే తన రెండు ఫ్లాట్లలో వచ్చి ఎవరైనా ఉండొచ్చని మహ్మద్ యూనుస్ అనే యువకుడు ఇంతకుముందు చెప్పాడు... గుర్తుంది కదూ. అలా అతడి అపార్టుమెంటులో తలదాచుకున్న వారిలో చిత్ర, మోహన్ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు. వీళ్లు నివాసం ఉంటున్న ఉరప్పక్కం అనే ప్రాంతానికి వెళ్లి.. రక్షించేందుకు పడవల వాళ్లు కూడా ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ యూనుస్ ఎలాగోలా వాళ్లను బతిమాలి.. అక్కడకు వెళ్లి జనాన్ని రక్షించి తన అపార్టుమెంటుకు తీసుకొచ్చాడు. అప్పటికి చిత్ర నిండు గర్భిణి. అక్కడ కరెంటు లేదు, చాలామంది జనం చెట్లమీద వేలాడుతున్నారు. ఎలాగోలా పడవ తెచ్చి, ఆ గర్భిణిని, మరికొందరిని పడవ ఎక్కించాడు. నీళ్లలో పడవ వెళ్తూ.. కూలిపోయిన చెట్టును ఢీకొని తిరగబడినంత పనైంది. దాంతో ఆమె భయంతో విలవిల్లాడిపోయింది. తర్వాత చిత్రను ఓ ఆస్పత్రిలో చేర్చగా.. శనివారం నాడు పండంటి ఆడబిడ్డను కంది. తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడినది యూనుస్ కాబట్టి.. అతడి పేరే తమ బిడ్డకు పెట్టుకున్నారా హిందూ దంపతులు. ఈ విషయం గురించి యూనుస్‌కు వాట్సప్ ద్వారా ఓ సందేశం కూడా పంపారు. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వచ్చి కలుస్తామని తెలిపారు. ఇకనుంచి తన జీతంలో సగం మొత్తాన్ని పేదలకు ఇస్తానని కూడా చెప్పారు. -
బ్రిటన్‌లో ‘బారసాల’ వివాదం!
బ్రిటన్‌లో ఓ బారసాల వివాదం కోర్టుకెక్కింది. పుట్టిన బిడ్డకు వెంటనే పేరు పెట్టకపోవటం తల్లిదండ్రులను న్యాయస్థానం మెట్లు ఎక్కించింది. మన హిందు మత సంప్రదాయాల ప్రకారం ‘బారసాల’ వేడుక నిర్వహించిన తర్వాతగానీ పిల్లలకు పేరు పెట్టరు. అప్పటివరకు తమ బిడ్డలను ఏదో ఒక ముద్దు పేరుతో తల్లిదండ్రులు పిలుచుకుంటారు. ఇది మన దగ్గర సార్వసాధారణం. అయితే ఇదే సంప్రదాయం బ్రిటన్‌లో నేరమైంది. బ్రిటన్‌కు చెందిన ఓ హిందూ దంపతులు తమ చిన్నారికి పుట్టిన ఐదు నెలల తర్వాత కూడా పేరు పెట్టకపోవడాన్ని తప్పుబడుతూ బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. చిన్నారికి పేరు పెట్టకపోవడం ‘భావోద్వేగపరంగా హాని చేయడమేనని’ పేర్కొంటూ.. శిశువును సోషల్ కేర్ సెంటర్‌కి అప్పగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో హెర్ట్ఫోర్డ్కు చెందిన హిందూ దంపతులు అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం బారసాల వేడుకను ఘనంగా నిర్వహించి చిన్నారికి పేరు పెడతామని, అప్పటివరకు తమకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును వేడుకున్నారు. అంతవరకూ తమ బిడ్డను తమ నుంచి వేరు చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.