మండలంలోని వరికూటివారిపాలెం గ్రామంలో గురువారం వరికూటి ఆంజనేయులుకు చెందిన ఒక ఆవుకు రెండు పెయ్యదూడలు పుట్టాయి. సాధారణంగా ఆవుకు కవలలు జన్మించవు. ఒకవేళ రెండు పెయ్యదూడలు పుట్టినా, రెండూ ఆరోగ్యంతో జీవించి ఉండడం చాలా అరుదు
గోమాతకు కవలల జననం
Aug 6 2016 6:27 PM | Updated on Apr 4 2019 4:44 PM
వరికూటివారిపాలెం (రేపల్లె రూరల్) : మండలంలోని వరికూటివారిపాలెం గ్రామంలో గురువారం వరికూటి ఆంజనేయులుకు చెందిన ఒక ఆవుకు రెండు పెయ్యదూడలు పుట్టాయి. సాధారణంగా ఆవుకు కవలలు జన్మించవు. ఒకవేళ రెండు పెయ్యదూడలు పుట్టినా, రెండూ ఆరోగ్యంతో జీవించి ఉండడం చాలా అరుదు. అయితే ఈ దూడలు రెండూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు. మహిళలు వీటిని మహాలక్ష్మిగా భావించి, శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయమై పశువైద్యుడు భవానీ ప్రసాద్‌ను వివరణ కోరగా పశువులకు కవలలు జన్మించడం చాలా అరుదని, పైగా రెండూ పెయ్యదూడలు జన్మించడం, తల్లీ, బిడ్డలూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం విశేషమని అన్నారు.
Advertisement
Advertisement