ఝార్సుగూడ(ఒడిశా): ప్రధాని మోదీ జన్మతః ఇతర వెనుకబడిన వర్గం(ఓబీసీ)వ్యక్తి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఘాంచి కులంలో పుట్టారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గురువారం రాహుల్ గాంధీ ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన సభలో మాట్లాడారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యాక మోదీయే ఈ కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఈ దృష్ట్యా, మోదీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కారని పేర్కొన్నారు.
అంతకుముందు, మోదీది తెలి కులమని పేర్కొన్న రాహుల్ ఆ తర్వాత తన ఉద్దేశం ఘాంచి కులమంటూ వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయం సాధించకుండా ప్రధాని మోదీ కులగణనను ఎప్పటికీ చేపట్టలేరని రాహుల్ చెప్పారు. ఓబీసీలతో కరచాలనం చేయని మోదీ బిలియనీర్లను మాత్రం ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. ‘ఒడిశాలోని గిరిజనుల భూములను లాగేసుకునేందుకు కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలోని అధికార బీజేడీ, బీజేపీల మధ్య పీ, డీ తేడా మాత్రమే ఉంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఒకే నాణేనికి ఈ పారీ్టలు రెండు పార్శా్వలు’అని రాహుల్ పేర్కొన్నారు. ఒడిశాలో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన జోడో యాత్ర గురువారం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment