
తండ్రితో ఆసిఫ్ కరడియా (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబై: పాకిస్తాన్‌లో పుట్టిన భారతీయ వ్యక్తికి సుదీర్ఘ పోరాటం తరువాత ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని పొందాడు. మహారాష్ట్రకి చెందిన ఆసిఫ్ కారడియా గత యాబై ఏళ్లుగా ముంబైలో నివశిస్తున్న అతనికి మాత్రం భారతీయ పౌరసత్వం లేదు. తన తండ్రి అబ్బాస్ కరాడియా 1962లో గుజరాతీ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అబ్బాస్ భార్య తన తల్లి దగ్గరకు కరాచి వెళ్లింది. అమె కరాచిలో ఉన్న సమయంలోనే 1965లో ఆసిఫ్ జన్మించాడు. రెండేళ్ల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన ఆసిఫ్‌కు పౌరసత్వం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
ఆసిఫ్‌కు భారతీయుడిగా గుర్తింపులేనందున అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొవడంతో తన కుమారుడికి భారతీయ పౌరసత్వం కల్పించాల్సిందిగా ఆసిఫ్ తండ్రి బాంబే హైకోర్టులో సంయుక్త పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అతను భారతీయ పౌరుడిగా అర్హుడని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం తల్లిదండ్రులు భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే వారికి జన్మించిన సంతానంకి కూడా అది వర్థిస్తుందని తీర్పులో పేర్కొంది. పౌరసత్వం ఇచ్చేందుకు మొదటి చర్యగా జిల్లా పాలనాధికారి ఆసీఫ్‌చే భారతీయ పౌరుడిగా ప్రమాణస్వీకారం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment