ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
Published Sat, Sep 3 2016 11:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు.
Advertisement
Advertisement