ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు
చింతూరు :
మండల పరిధిలోని పెదశీతనపల్లి పంచాయతీ కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ వంజం ముత్తమ్మ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం ఈమెను చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ,బిడ్డలు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు క్రిస్టోఫర్ తెలిపారు.