లండన్: బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడొచ్చాడు. యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించేందుకు ఇప్పటికే ఆరుగురు క్యూలో ఉండగా, ఈ కొత్త వారసుడు ఏడో వాడయ్యాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.26 గంటలకు మేఘన్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు 3.2 కేజీల బరువు ఉన్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రిన్స్ హ్యారీ విలేకరులకు చెప్పారు. ‘నాకు ఇంతకంటే గొప్ప విషయం ఇప్పటివరకు ఏదీ లేదు. నా భార్యను చూస్తే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చంద్రుడిపై ఉన్నంత సంతోషంగా ఉంది’ అని హ్యారీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment