లక్నో : రామయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా మొదలైందంటూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు అంటుంటారని దీన్ని బట్టి టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా రామాయణ కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.
మహాభారత కాలం నాటి నుంచే పాత్రికేయం ఉన్నదని గురువారం శర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసందే. హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరైన శర్మ నూతన ఆవిష్కరణలను పురాతన భారత్‌తో పోల్చుతూ లైవ్ టెలికాస్ట్ మహాభారత కాలంలో ఉందని పేర్కొన్నారు.
‘గూగుల్ ఇప్పుడు మొదలైంది. మన గూగుల్ ఎప్పుడో మొదలైంది. నారద మహర్షి సమాచార చేరవేతకు ఓ ఉదాహరణ.’ అని శర్మ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment