హైదరాబాద్ : బోల్డ్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్‌తో ఇటు కుర్రకారును, అటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న యంగ్ హీరోయిన్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న‘ సీత’ సినిమాలో ఒక పెప్పీసాంగ్‌కు స్టెప్పులేసే లక్కీ చాన్స్ దక్కించుకుందట. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో అనూప్ రూబెన్స్ స‍్వరపర్చిన ఈ పాటను చిత్రీకరించబోతున్నారని సమాచారం.
తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సీత సినిమాలో కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. అంతేకాదు కాజల్ నెగిటివ్‌రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ చాలా కాలం తరువాత మళ్లీ టాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే పాయల్, కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కానున్నాయి. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇక‍్కడ వరస ఆఫర‍్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ సినిమా 'డిస్కో రాజా' తో పాటు, మన్మథుడు-2 మూవీలో కూడా చాన్స్ కొట్టేసింది. అలాగే కవచం సినిమా తరువాత కాజల్‌కు బెల్లంకొండతో ఇది రెండవ సినిమా. మరోవైపు ఇప్పటికే విడుదలైన సీత ఫస్ట్ లుక్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment