ఏ సాంగ్స్‌ చేయడం లేదు: పాయల్‌ రాజ్‌పుత్‌ | Payal Rajput: Iam Not Going To Part Of Any Song | Sakshi
Sakshi News home page

ఒక్క మాటలో తేల్చి చెప్పిన పాయల్‌ రాజ్‌పుత్‌

Published Tue, May 25 2021 8:17 AM | Last Updated on Tue, May 25 2021 8:20 AM

Payal Rajput: Iam Not Going To Part Of Any Song - Sakshi

కింగ్‌ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది 'బంగార్రాజు'. 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో నాగ్‌ బంగార్రాజు పాత్రకు అద్భుత స్పందన రావడంతో అదే పేరు మీద సీక్వెల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలోనూ పాయల్‌.. 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చె బుల్‌రెడ్డి..' పాటలో ఆడి అలరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మరోసారి ఐటమ్‌ సాంగ్‌కు రెడీ అయిందని సోషల్‌ మీడియాలో కథనాలు రాగానే నిజమేనని నమ్మేశారు అభిమానులు. కానీ ఈ ప్రచారానికి చెక్‌ పెడుతూ అవన్నీ వుట్టి పుకార్లేనని బదులిచ్చిందీ హీరోయిన్‌. తాను ఏ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్స్‌లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. చైతూ జోడిగా ఆయన భార్య, హీరోయిన్‌ సమంత కనిపించనున్నట్లు సమాచారం.

చదవండి: తెలుగు సినిమా చరిత్ర విశేషాలతో ఓ మ్యూజియమ్‌ ఏర్పాటు చేయాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement