ప్రభాస్‌-కాజల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ | Kajal Aggarwal Performs Special Song In Prabhas Salaar Movie | Sakshi
Sakshi News home page

Prabhas Kajal: ప్రభాస్‌-కాజల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌

Published Tue, Jul 6 2021 8:41 AM | Last Updated on Tue, Jul 6 2021 11:25 AM

Kajal Aggarwal Performs Special Song In Prabhas Salaar Movie - Sakshi

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ఇప్పటికే చిరంజీవితో ఆచార్య, కమల్‌హాసన్‌తో ఇండియన్‌-2 చిత్రాలు చేస్తున్న కాజల్‌ ఇప్పుడు మరో పాన్‌ ఇండియా ప్రాజెక్టులో కనిపించనుందట. కథల ఎంపిక విషయంలో చాలా పకడ్బందీగా ఆలోచిస్తున్న కాజల్‌...ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. ప్రభాస్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌లో చిందేయడానికి ఈ చందమామ ఒప్పుకున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం..ప్రస్తుతం ప్రభాస్‌ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతుంది.

ఇక తర్వాతి షెడ్యూల్‌లో భాగంగా ఓ స్పెషల్‌ సాంగ్‌ను మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సాంగ్‌లో ప్రభాస్‌తో కలిసి మాస్‌ స్పెప్పులేసేందుకు కాజల్‌ను ఫైనల్‌ చేశారట. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘డార్లింగ్‌’ ‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు సూపర్‌హిట్‌ కావడంతో పాటు వీరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ స్ర్కీన్‌ ముందు జోడిగా కనిపిస్తే ఫ్యాన్స్‌కు ఇక పండగే. ఇక ఇప్పటికే కాజల్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘జనతాగ్యారేజ్‌’ సినిమాలో  ‘పక్కా లోకల్‌..’ అనే స్పెషల్‌ సాంగ్‌తో ఇరగదీసిన సంగతి తెలిసిందే. యూత్ సహా మాస్‌ ఆడియెన్స్‌ను తన స్టెప్పులతో ఉర్రూతలూగించిన కాజల్‌..చాలా గ్యాప్‌ తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement