జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీత సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు, వచ్చే ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీత సోరెన్ పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారింది.
కాగా జేఎమ్‌ఎమ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన అవుతుంది. అనారోగ్యంతో దుర్గా సోరెన్ 2009లో మరణించారు. అప్పుడు ఆయన వయసు 39 ఏళ్లు. అయితే భర్త మరణానంతరం తనను, తన కుటుంబాన్ని సోరెన్ కుటుంబ సభ్యులు పక్కన పెట్టారని ఆరోపిస్తూ మంగళవారం జేమ్‌ఎమ్ పార్టీకి సీత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలోని అన్ని పదవులకు, జార్ఖండ్ అసెంబ్లీలోని జామా స్థానానికి కూడా ఆమె రాజీనామా చేశారు.
‘కుటుంబంలోనే కాదు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానని ఆరోపించారు. తనకు, తన కుతూళ్లకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తోందని విమర్శించారు. అయిష్టంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు మామ శిబు సోరెన్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment