‘నువ్వు సీతవి కాదు.. శూర్పణఖవి’ | Bellamkonda Sai Srinivas And Kajal Aggarwal Sita Teaser | Sakshi
Sakshi News home page

‘నువ్వు సీతవి కాదు.. శూర్పణఖవి’

Published Sun, Mar 31 2019 11:51 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda Sai Srinivas And Kajal Aggarwal Sita Teaser - Sakshi

వరుసగా మాస్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇన్నాళ్లు మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి ఓ లేడి ఓరియంటెడ్‌ సినిమాకు ఓకె చెప్పాడు. తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు సాయి శ్రీనివాస్‌‌. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో సీనియర్‌ హీరో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది.

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకోవటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో కీలకమైన సీత పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో కూడా ఎక్కువగా హీరోయిన్‌ పాత్రనే ఫోకస్‌ చేశారు. ఇన్నాళ్లు సీరియస్‌ యాక్షన్‌ రోల్స్‌ లో కనిపించిన శ్రీనివాస్‌ ఈ సినిమా కామెడీ టచ్‌ ఉన్న పాత్రలో నటించాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement