
ఆల్చిప్పల్లాంటి కళ్లతో అభిమానుల మనసుల్ని దోచుకుంది కాజల్ అగర్వాల్. యంగ్ హీరోయిన్స్ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో కూడా కాజల్ తన జోరును చూపిస్తోంది. రీసెంట్‌గా సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీత పాత్రలో కాజల్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. కాజల్ సోషల్ మీడియాలో నిత్యం తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా కాజల్ ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న ఫోటోను షేర్ సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. ‘జనాలు తమని తాము కనుగొనలేరు. ఎందుకంటే అందం.. గ్లామర్ ఎలివేషన్ ప్రపంచంలో మనం ఉన్నాం. సోషల్ మీడియా చెప్పేదే నిజం అని జనాల అభిప్రాయం. వందల కోట్ల సొమ్ముల్ని సౌందర్య సాధనాల కోసం.. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తున్నాం. అందం పిచ్చి అన్నిచోట్లా ఉంది. మనం అసలైన ఆనందం పొందేది నిజాన్ని బయటకు చూపించినప్పుడే. మనలోని డిఫరెంట్ ఇమేజ్ ని ఈ ప్రపంచానికి చూపించినప్పుడే. మేకప్ వల్ల వచ్చే అందం అనేది బయటకు చూపించుకునేది మాత్రమే. అది మన క్యారెక్టర్ ని బయటకు చెబుతుందా? నిజమైన అందం మనం అంతర్గతంగా ఎంత లవ్ లీగా ఉంటామో దానివల్లనే వస్తుంది’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment