ఆస్తి పర్మినెంట్‌.. పెళ్లి టెంపరరీ! | Sita Movie Trailer Release | Sakshi
Sakshi News home page

ఆస్తి పర్మినెంట్‌.. పెళ్లి టెంపరరీ!

Published Sat, May 11 2019 1:16 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Sita Movie Trailer Release - Sakshi

బెల్లకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌

ఆమె పేరు సీత. డబ్బుకు చాలా విలువ ఇస్తుంది. అందుకే పర్మినెంట్‌ ఆస్తి కోసం ఓ టెంపరరీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో అనుకోని మలుపు ఎదురవుతుంది? అది ఏంటన్నది తెలియాలంటే ఈ నెల 24 వరకూ వేచి చూడాల్సిందే. బెల్లకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.  సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్‌సాంగ్‌ చేశారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్, సంగీతం: అనూప్‌ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement