ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రమోగాత్మక చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘అంధాథూన్’, ‘బదాయి హో’ వంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత హీరోలలో డిఫరెంట్ సినిమాలు చేసే స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత ఆయుష్మాన్ పేరే వినపడుతోంది. తాజాగా ఈ హీరో డిఫరెంట్ రోల్‌లో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లను వసూలు చేసింది. ఇంత భారీ వసూళ్లు రాబట్టడంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే ఆయుష్మాన్ ఖురానా కరమ్‌గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇందులో కరమ్ స్థానికంగా జరిగే చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు చేస్తుంటాడు. దీంతో అమ్మాయి గొంతుతో ఫేమస్ అయిన కరమ్‌కు ఫ్రెండ్‌షిప్ అనే కాల్ సెంటర్‌లో జాబ్ వస్తుంది. కరమ్ పేరు కాస్త పూజాగా మార్చుకుంటాడు. లోన్లీగా ఫీలయి కాల్ సెంటర్‌కు ఫోనే చేసే అమ్మాయి, అబ్యాలతో గొంతు మార్చి సరదాగా మాట్లాడుతూ వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతాడు.
Comments
Please login to add a commentAdd a comment