
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక హత్యాచార ఘటన వెండితెరపైకి రానుందని టాక్. హిందీలో ఈ ఘటన నేపథ్యంలో సినిమా తీయడానికి దర్శకురాలు మేఘనా గుల్జార్ సన్నాహాలు మొదలుపెట్టారట. పోలీసులు బాధితురాలి పేరుని వెల్లడించకుండా ‘దిశ’ అని పేర్కొన్న ఆ ఘటన చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఈ చిత్రానికి ముఖ్య తారలుగా కరీనా కపూర్, ఆయుష్మాన్ ఖురానాలను ఎంపిక చేశారట మేఘన. కరీనా, ఆయుష్ స్క్రిప్ట్ చదివి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘తల్వార్, రాజీ, చపాక్, సామ్ బహదూర్’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు మేఘన. దిశ ఘటనపై ఆమె తెరకెక్కించనున్న చిత్రం గురించి త్వరలో అధికారక ప్రకటన రానుందట.
Comments
Please login to add a commentAdd a comment