ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ కామెడీ ఫిలిం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే? | Ayushmann Khurrana Dream Girl 2 Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Dream Girl 2 In OTT: ఓటీటీలోకి రూ.140 కోట్లు కొల్లగొట్టిన కామెడీ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Thu, Oct 19 2023 4:22 PM | Last Updated on Thu, Oct 19 2023 4:49 PM

Ayushmann Khurrana Dream Girl 2 Movie OTT Release Date Confirmed - Sakshi

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ డ్రీమ్‌ గర్ల్‌ 2. ఇది 2019లో వచ్చిన డ్రీమ్‌ గర్ల్‌ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కింది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది.

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి
థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోందీ మూవీ. అక్టోబర్‌ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'మీ కలలు నిజం కాబోతున్నాయి. డ్రీమ్‌ గర్ల్‌ రెట్టింపు మ్యాజిక్‌, డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తిరిగి వస్తోంది.. రేపటి నుంచి డ్రీమ్‌ గర్ల్‌ 2 ఓటీటీలో అందుబాటులో ఉంటుంది' అని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

ఫ్యాన్స్‌ ఖుషీ..
ఇది చూసిన అభిమానులు.. హమ్మయ్య, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. రాజ్‌ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరమ్‌గా ఆయుష్మాన్‌, పరిగా అనన్య పాండే నటించింది. పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ, మంజోత్‌ సింగ్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌ కీలక పాత్రలు పోషించారు.

చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement