అంధాధున్, బదాయి హో సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డ్రీమ్ గర్ల్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో ఆయుష్మాన్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నాడు. టైటిల్‌ను బట్టే తెలుస్తోంది ఈ యంగ్ హీరో మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని.
రాజ్ శాండిల్య దర్శకత్వంలో ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. టీషర్ట్, చీర, చేతికి గాజులతో ఆయుష్మాన్ లుక్ వినోదాత్మకంగా ఉంది. నుస్రత్ బారుచా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
As whacky as it can get! Here's the first glimpse of my look in and as #DreamGirl. Thoughts?#DreamGirlFirstLook #DreamGirlFilmingBegins @ektaravikapoor @NushratBharucha @RuchikaaKapoor @writerraj @balajimotionpic pic.twitter.com/qyJib4U9Ao
— Ayushmann Khurrana (@ayushmannk) 3 December 2018
Comments
Please login to add a commentAdd a comment