వ్యక్తిగత కారణాలతోనే ఆమె పాడలేదు!
వ్యక్తిగత కారణాలతోనే ఆమె పాడలేదు!
Published Thu, Oct 16 2014 3:02 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM
న్యూఢిల్లీ: మనకు డ్రీమ్ గర్ల్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే హీరోయిన్ హేమమాలిని. ఈ రోజు ఆమె పుట్టినరోజు. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని అభిమానుల్లో చెరగని ముద్రవేసిన హేమమాలిని గురువారం 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఆమెకు సినీ జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో తన సినిమాలో పాట పాడాలని హేమమాలినా కోరినా.. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తిరస్కరించిందట. ఆ విషయాన్ని స్వయంగా హేమమాలిని ట్వీట్ చేశారు. 1979 లో వచ్చిన 'మీరా' సినిమాలో హీరోయిన్ అయిన హేమమాలినికి లతా మంగేష్కర్ గాత్రదానం చేశారు.
అయితే తరువాత తాను నటించే సినిమాలో పాడమని అడిగినా అందుకు లతా మాత్రం ఆసక్తి కనబరలేదని హేమమాలిని తెలిపింది. దీనికి పెద్దగా కారణాలు ఏమీ లేవని, వ్యక్తిగత కారణాలతోనే లతా ఆ సినిమాలో పాడలేదని హేమమాలిని స్పష్టం చేసింది.' అప్పుడు నా సినిమాలో పాడటానికి ఆమె తిరస్కరించింది. అది గతం. ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులం'అని హేమమాలిని తెలిపింది. ఈ రోజు తనకు లతా నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నట్లు కూడా హేమమాలిని స్పష్టం చేసింది.
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి, అక్కడి వెండితెరను ఏలిన డ్రీమ్గర్ల్ హేమమాలిని. ఒక్క ధర్మేంద్ర మాత్రమే కాదు.. చాలామంది హృదయాలను ఆమె కొల్లగొట్టారు. ఈ అందాల సుందరికి అప్పుడే 66 ఏళ్లు నిండాయి. ముంబైలో తన పెద్దకూతురు ఇషా డియోల్, అల్లుడు భరత్లతో తన పుట్టినరోజును చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీగా కూడా ఉన్న హేమమాలిని.. ఈ పుట్టినరోజుకు ఎలాంటి ఆర్భాటాలు మాత్రం ఉండకూడదనే కోరుకుంటున్నారు.
Advertisement
Advertisement