అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పాత తరంలో చెప్పలేనంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. ఇప్పటికీ తను నటించిన షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. దీంతో నేటి తరం వారికి కూడా ఆయనంటే అభిమానం.
(ఇదీ చదవండి: అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా)
ప్రముఖ నటి హేమమాలిని ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. కాగా వారికి 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు.
తాజాగా ఇదే విషయంపై హేమమాలినిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రకాష్ కౌర్ సమర్థించింది. హేమమాలిని కూడా ధర్మేంద్రకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులతో చాలా మర్యాదగానే ప్రవర్తిస్తుందని ప్రకాష్ కౌర్ చెప్పుకొచ్చింది. గతంలో దర్మేంద్రను 'ఉమెనైజర్' అని పలువురు కామెంట్లు చేశారు.. అదే కామెంట్లను ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అని ప్రకాష్ కౌర్ ఇలా స్పందించింది.
(ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్)
'నా భర్త మాత్రమే ఎందుకు, ఏ మగాడైనా నాకంటే హేమమాలినినే ఇష్టపడతారు. ఇండస్ట్రీలో సగం మంది ఇదే పని చేస్తున్నప్పుడు నా భర్తను ఉమెనైజర్ అని పిలవడానికి ఎవరైనా ఎంత ధైర్యం చేస్తారు? హీరోలందరూ ఎఫైర్లు పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అతను నాకు మంచి భర్త కాకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా ఉత్తమ తండ్రి. అతని పిల్లలు అతన్ని చాలా ప్రేమిస్తారు. అతను వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.' అని చెప్పింది.
ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు బాలీవుడ్‌లో టాప్ హీరోలైన సన్నీ డియోల్,బాబీ డియోల్ అని తెలిసిందే. కాగా వారికి విజేత,అజీత అనే సోదరీమణుల ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment