
హేమమాలిని ఆత్మహత్య చేసుకోలేదు కదా?
రైతుల ఆత్మహత్యలమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలను మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఖండించారు.
న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఖండించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌సీ షైనా గురువారం వివాదాస్పద వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవట్లేదని వ్యాఖ్యానించారు. మద్యం తాగి మత్తులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివాదాస్పద మాటలు అన్నారు.
కాగా షైనా చేసిన వ్యాఖ్యలను స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చుఖడ్ ఖండించారు. రాష్ట్రంలో చాలా మంది మద్యం తాగుతారని అన్నారు. 75శాతం మంది ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు మద్యం సేవిస్తున్నారని వారందరూ ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవట్లేదని ప్రశ్నించారు. బాలీవుడ్ నటీ హేమమాలిని కూడా మందు తాగుతుంది. అలా అని మత్తులో ఆత్మహత్య చేసుకుందా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలను అవహేలన చేయడంతగదని హితవు పలికారు.