సాక్షి, ముంబై : దేశంలో నానాటికి రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర శాసన మండలిలో ప్రకటించిన ఘణాంకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 639 మంది రైతులు అత్మహత్య చేసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖమంత్రి చంద్రకాంత్ పాటిల్ మండలిలో తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు శనివారం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న 639 మందిలో ఇప్పటి వరకూ 174 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి ప్రకటించారు.
122 మంది రైతుల ఆత్మహత్యలకు కారణాలేంటో తెలియరాలేదని ప్రభుత్వం అందించే నష్ట పరిహారానికి వారు అర్హులు కారని మంత్రి వెల్లడించారు. రుణమాఫీ, మద్దతు ధర, ఎరువులపై రాయితీలు ఇవ్వకపోవడం మూలంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని మహారాష్ట్ర రైతులు ఇటీవల మహా పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. రైతులు డిమాండ్‌లను అమలు చేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన.. రైతుల ఆత్మహత్యలును మాత్రం ప్రభుత్వం నివారించలేకపోతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment