Hema Malini Breaks Silence on MP Comments Comparing Roads to Her Cheeks: తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా ఉన్నాయంటూ రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్ గుదా ఝాంజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ సైతం ఇదే తరహాలో అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మంత్రులు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాందంటూ పలువురు సినీ, రాజకీయన ప్రముఖులు స్పందిస్తూ తప్పుబుడుతున్నారు.
చదవండి: క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
తాజాగా మహారాష్ట్ర మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై నటి, ఎంపీ హేమమాలిని స్పందించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ఇలాగే అన్నారని గుర్తు చేశారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సంప్రదాయాన్ని లాలూ ప్రసాద్ మొదలు పెట్టారన్నారు ఆమె. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ సరైనవి కావని హేమమాలిని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ, గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు.
చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్
#WATCH "A trend of such statements was started by Lalu Ji years ago and many people have followed this trend. Such comments are not in a good taste," says BJP MP Hema Malini on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks pic.twitter.com/SJg5ZTrbMw
— ANI (@ANI) December 20, 2021
ఇక మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు. కాగ 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. ఇక 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్ చెంపల మాదిరిగా నిర్మిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment