Bollywood Newlyweds: Katrina Kaif And Vicky Kaushal lands In Mumbai After Marriage Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vicky Kaushal-Katrina Kaif: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన కత్రినా, విక్కీ కౌశల్‌

Dec 14 2021 6:44 PM | Updated on Dec 15 2021 11:32 AM

Katrina Kaif And Vicky Kaushal lands In Mumbai After Marriage Video Goes Viral - Sakshi

బాలీవుడ్‌ నూతన వధూవరులు విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్‌లో చిన్న హానీమూన్‌ ట్రిప్‌ ముగించుకుని మంగళవారం(డిసెంబర్‌ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి.

చదవండి: సల్మాన్‌,రణ్‌బీర్‌ నుంచి కత్రినాకు కాస్ట్‌లీ గిఫ్ట్స్!, అవేంటో తెలుసా?

దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. కత్రినా చుడిదార్‌ ధరించి నుదుట తిలకంతో కనిపించగా, విక్కీ ఫార్మల్‌ లుక్‌లో ఉన్నాడు. చూడటానికి ఈ జంట చాలా అందంగా కనిపించారు. వీరిద్దరూ ఒకరిచేయి ఒకరు పట్టుకుని మీడియాను పలకరించడం అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కత్రినా నవ్వూతూ చాలా సంతోషంగా కనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్‌ ‘చాలా రోజుల తర్వాత క్యాటీ మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నా’, ‘క్యూట్‌ కపుల్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. రొమాంటిక్‌ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్‌ కపుల్‌

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో డిసెంబర్‌ 9న కత్రినా, విక్కీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరూ సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం సాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జంట కత్రినా, విక్కీలు ఎప్పుడు మీడియా ముందుకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిన రహస్యంగా వెళ్లే ఈ జంట మీడియ ముందు విడివిడిగా ఉండేవారు. అలా పెళ్లి వరకు వీరి రిలేషన్‌ విషయంలో గొప్యంగా ఉంచిన విక్ట్రీనా.. తొలిసారి పక్కపక్కనే ఒకరి చేయి ఒకరు పట్టుకుని భార్యభర్తలు కనిపించడంతో వారి ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement