
ముంబై: భార్య బ్యాంక్ అకౌంట్ నుంచి ఆమెకు తెలియకుండా డబ్బులు విత్‌డ్రా చేసిన ఘటనలో హిందీ బుల్లితెర నటుడు కరణ్ మెహ్రాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు డ్రా చేసిన డబ్బులు వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోటి రూపాయలు. తనకు తెలియకుండా అకౌంట్ నుంచి కోటి రూపాయల డబ్బు ఉపసంహరించుకున్నట్లు తెలుసుకున్న కరణ్ భార్య నిషి శుక్రవారం గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి టీవీ నటుడు, అతని ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా భర్తకు వ్యతిరేకంగా నిషా పోలీసులను సంప్రదించడం ఇది రెండోసారి. దీనికంటే ముందు మే 31 న మెహ్రా తన భార్యపై దాడి చేసినందుకు గోరేగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత ఈ కేసులో అతనికి బెయిల్ లభించింది. ఇక ఈ జంటకు వివాహం జరిగి 8 సంవత్సరాలు అవుతుండగా.. వీరికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
అప్పట్లో వీరిద్దరి మధ్య సఖ్యత సరిగా లేదని, మనస్పర్థలు తలెత్తాయని పుకార్లు వచ్చాయి. నిషా ప్రవర్తన సరిగా లేదని, చాలా దూకుడుగా వ్యవహిస్తుంటుందని కరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తనకు కోపం వచ్చిన్పపడు అందరిపై దాడి చేస్తుందని, ఇంట్లోని వస్తులను పగలగొడుతుందని అన్నారు. తన భార్య చేష్టలతో ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు.
చదవండి:
అవార్డుల ఫంక్షన్‌లో డ్యాన్సర్‌ను ముద్దాడిన గాయకుడు!
Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment