
ఔనా! దీపిక ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా?
'దీపికా.. మీ ఎంగెజ్‌మెంట్ సందర్భంగా నా ఆశీస్సులు. మీరిద్దరూ కలిసి జీవిస్తూ.. సుఖసంతోషాలను పొందాలని, మంచి భవిష్యత్ మీకు కలుగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అంటూ బాలీవుడ్ ఆలనాటి నటి, డ్రిమ్‌గర్ల్ హేమామాలిని గురువారం ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్ పెద్ద దుమారమే రేపింది.
'దీపికా.. మీ ఎంగెజ్‌మెంట్ సందర్భంగా నా ఆశీస్సులు. మీరిద్దరూ కలిసి జీవిస్తూ.. సుఖసంతోషాలను పొందాలని, మంచి భవిష్యత్ మీకు కలుగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అంటూ బాలీవుడ్ ఆలనాటి నటి, డ్రిమ్‌గర్ల్ హేమామాలిని గురువారం ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్ పెద్ద దుమారమే రేపింది. బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ గతకొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. నిత్యం వార్తల్లో దర్శనమిస్తూ తమ ప్రేమను ప్రగాఢంగా చాటుకుంటున్న ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? ఈ విషయం తెలియడంతో హేమామాలిని వారికి శుభాకాంక్షలు తెలిపిందా? అన్న ఊహాగానాలతో ట్విట్టర్ ఊగిపోయింది. ఈ ప్రేమజంట ఫ్యాన్స్ అయితే వరుసగా హేమామాలిని ట్యాగ్ చేస్తూ.. నిజంగా మా దీపిక-రణ్‌వీర్ సింగ్‌ల ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? వారి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ? అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు.
ట్విట్టర్‌లో హేమ శుభాకాంక్షలు చాలాసేపు హల్‌చల్ చేసిన తర్వాత డ్రీమ్ గర్ల్ తీరికగా స్పందించింది. 'అయ్యో! నేను శుభాకాంక్షలు తెలిపింది దీపికా పదుకొనేకు కాదు. ఈమె వేరే దీపిక' తిరిగ్గా సమాధానం ఇచ్చింది. దీంతో అభిమానులు నిట్టూర్చారు. మా దీపిక-రణ్‌వీర్ సింగ్‌ల ఎంగేజ్‌మెంట్ కూడా త్వరగా అయిపోతే బాగుండు అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.