ఉత్తరప్రదేశ్‌లోని మథుర హింసాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని మథుర ఎంపీ, బాలీవుడ్ నటి హేమాలిని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర హింసాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని మథుర ఎంపీ, బాలీవుడ్ నటి హేమాలిని డిమాండ్ చేశారు. అక్కడ 3వేల మందికి పైగా జనం ఆయుధాలతో ఉంటే అధికార యంత్రాంగానికి ఏమీ తెలియలేదా అని ఆమె ప్రశ్నించారు. అధికారులకు ముందు నుంచే అక్కడి విషయం తెలుసునని, అయితే వాళ్లు పరిస్థితిని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు.
ఆక్రమణలను నిరోధించడానికి, నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని చెప్పారు. కేవలం హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్లు చర్యలకు ప్రయత్నించారని హేమమాలిని అన్నారు.