సీనియర్ నటి, రాజకీయవేత్త హేమమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించింది. 1960లో సినీ రంగంలో అడుగు పెట్టిన హేమమాలిని తన కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2004లో భాజపాలో చేరిన ఆమె ప్రస్తుతం మథుర నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. సినిమాల్లో నటిస్తూనే ధర్మంద్రను ప్రేమను వివాహాం చేసుకున్నారామె. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు.
(ఇది చదవండి: రూ.500కోసం హీరోహీరోయిన్ల వీడియో లీక్ చేశారు! )
హేమ మాలిని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. గతంలో ఓ డైరెక్టర్ తన చీరకు ఉన్న పిన్ తీయాలని కోరాడని వెల్లడించింది. ఆ సమయంలో అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందో.. అదే ఈ రోజు అత్యంత కష్టతరమైన ప్రక్రియగా మారిందని హేమ ప్రస్తావించారు. తాను మళ్లీ సినిమాల్లో పని చేస్తానని అనుకోవడం లేదన్నారు.
హేమ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడు. నేను ఎప్పుడూ నా చీరపై పిన్‌ను పెట్టుకుంటాను. నన్ను చీరకు ఉన్న పిన్ తీసేయమని అడిగారు. కానీ నేను మాత్రం చీర కింద పడిపోతుంది అన్నా. మాకు అదే కావాలి అన్నారు.' అని హేమ గుర్తు చేసుకున్నారు. అలాగే 'సత్యం శివం సుందరం' సినిమా ఎప్పటికీ చేయనని తెలిసినా.. రాజ్ కపూర్ తనని ఎలా సంప్రదించాడో కూడా ఆమె వెల్లడించింది. హేమకు ఇద్దరు పిల్లలు ఈషా, అహానా ఉన్నారు.
(ఇది చదవండి: 'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్ టీజర్)
Comments
Please login to add a commentAdd a comment