
డ్రీమ్‌గర్ల్.. సిమ్లా మిర్చ్
చాలా గ్యాప్ తర్వాత ‘డ్రీమ్‌గర్ల్’ హేమమాలిని మళ్లీ వెండితెరపై కనిపించనుంది. రమేష్ సిప్పీ రూపొందిస్తున్న ‘సిమ్లా మిర్చి’లో రాజ్‌కుమార్‌రావు సరసన నటిస్తోంది. ‘సిమ్లామిర్చి’ షూటింగ్ ఆదివారం మొదలైంది. మొదటి రోజు షూటింగ్ తర్వాత హేమమాలిని ‘ట్విట్టర్’ ద్వారా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. దర్శకుడు రమేష్ సిప్పీ కూడా ఇందులో అతిథిపాత్రలో కనిపించనున్నాడు. రమేష్ సిప్పీ దర్శకత్వంలోని ‘అందాజ్’, ‘సీతా ఔర్ గీతా’, ‘షోలే’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో హేమమాలిని నటించిన సంగతి తెలిసిందే.