బీజేపీ నాయకురాలు, బాలీవుడ్ నటి హేమామాలిని (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: తనకివే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తాను పోటీచేయనని బీజేపీ నాయకురాలు, ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమామాలిని మాట్లాడుతూ.. ‘ఇవి నా చివరి ఎన్నికలు. భవిష్యత్‌లో నేను ఎన్నికల బరిలో నిలవను. నేను సిట్టింగ్ ఎంపీగా ఉన్న మధుర నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన అమిత్ షా, మోదీలకు నా కృతజ్ఞతలు. నేను మిగిలిన రాజకీయ నాయకుల్లాంటి దాన్ని కాను. మధుర అభివృద్ధికి నేను పడిన కష్టం ప్రజలకు తెలుసు. వాళ్ల కోరిక మేరకే ఇక్కడ పోటీకి దిగుతున్నాన’ని వివరించారు.
దేశంలోని 184 నియోజకవర్గాలకు తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. యూపీలోని మధుర నియోజవర్గం నుంచి బరిలోకి సిట్టింగ్ ఎంపీ, నటి హేమామాలినీనే నిలపాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. మధురలో హేమామాలినీకి పోటీగా మహేశ్ ఠాకూర్‌ను ఎంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఉత్తర్‌ప్రదేశ్‌లో 6 దశల్లో లోక్‌సభ పోలింగ్ జరగనుంది. అక్కడ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతాయి. ఫలితాలు మే 23న వెలువడతాయి.
Comments
Please login to add a commentAdd a comment