mathura mp
-
‘స్థానికేతర’పై కాంగ్రెస్‌కు హేమమాలిని కౌంటర్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య స్థానిక, స్థానికేతర అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని స్థానికతను టార్గెట్ చేస్తూ మథుర పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ ధంగర్ ఇటీవల విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ హేమామలిని మథురకు స్థానికురాలు కాదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత విమర్శలపై తాజాగా మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలిని ఓ జాతీయ మీడియా ఇంటర్య్వూలో పాల్గొని మాట్లాడారు. ‘నేను గత పదేళ్లుగా మథురలో స్థానికురాలిని. శ్రీకృష్ణ భగవానుడికి భక్తురాలుగా నేను ఇక్కడ స్థానికురాలినే. నేను ఇక్కడి ఎంపీగా పలు సేవలు అందించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అందుకే నేను ఇక్కడి వ్యక్తినే. నన్న మీరు(కాంగ్రెస్ నేతలు) స్థానికేతర వ్యక్తిగా భావించినా.. స్థానికేతర వ్యక్తిగానే బాగా సేవలు అందిచగలరని నమ్ముతా. స్థానికులుగా ఇక్కడే ఉండే వారికి ఈ ప్రాంత మంచి, చెడు తెలియదు. వారు ఇక్కడి పరిస్థితులను మెరుగ్గా మార్చాలనుకోరు. స్థానికేతరులు మాత్రం అలా కాదు.. ఎందుకంటే బయటినుంచి వచ్చినవారికి చాలా అనుభవాలు ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. నేను ఒక ఎంపీగా... కేంద్రంలోని మంత్రుల సాయంతో మథురలో చాలా అభివృద్ధి పనులు చేశాను. నేను ఒక ఎంపీగా నా పదవి మచ్చ తీసుకురాలేను. ఒక ఎంపీగా సరైనా సేవలు అందిస్తే.. ప్రతి నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. నేను ఈ ప్రాంతానికి మంచి చేయటం కోసం ముంబై నుంచి మథుర ఎనిమిది గంటలు ప్రయాణిస్తాను. లెక్కలేనన్ని సార్లు ముంబై- మథుర వస్తూ ఉంటా.. ఎందుకంటే నాకు మథుర ప్రాంతానికి మంచి చేయాలనే తపన ఉంటుంది’ అని ఎంపీ హేమమాలిని అన్నారు. ఇప్పటికే మథుర నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందని హేమమాలినికి బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సైతం మారోమారు అవకాశం ఇచ్చింది. హేమమాలిని స్థానికురాలు కాదని.. తాను స్థానికుడనని ఈసారి ఎన్నికల్లో మథురలో తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ ధంగర్ ప్రజలను కోరుతున్నారు. ఇక..మొదటిసారి 2014 సార్వత్రిక ఎన్నికలో బీజేపీ తరఫు హేమమాలిని పోటీ చేసీ సమీప రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి జయంత్ చౌదరీ ఓడించారు. సుమారు 3 లక్షల భారీ మేజార్టీతో హేమమాలిని గెలుపొందారు. 2019లో సైతం సమీప ఆర్ఎల్డీ అభ్యర్థి కున్వర్ నరేంద్రపై హేమమాలిని 2,93,471 మేజార్టీతో విజయం సాధించారు. -
నాకివే చివరి ఎన్నికలు..!
సాక్షి, న్యూఢిల్లీ: తనకివే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తాను పోటీచేయనని బీజేపీ నాయకురాలు, ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమామాలిని మాట్లాడుతూ.. ‘ఇవి నా చివరి ఎన్నికలు. భవిష్యత్‌లో నేను ఎన్నికల బరిలో నిలవను. నేను సిట్టింగ్ ఎంపీగా ఉన్న మధుర నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన అమిత్ షా, మోదీలకు నా కృతజ్ఞతలు. నేను మిగిలిన రాజకీయ నాయకుల్లాంటి దాన్ని కాను. మధుర అభివృద్ధికి నేను పడిన కష్టం ప్రజలకు తెలుసు. వాళ్ల కోరిక మేరకే ఇక్కడ పోటీకి దిగుతున్నాన’ని వివరించారు. దేశంలోని 184 నియోజకవర్గాలకు తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. యూపీలోని మధుర నియోజవర్గం నుంచి బరిలోకి సిట్టింగ్ ఎంపీ, నటి హేమామాలినీనే నిలపాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. మధురలో హేమామాలినీకి పోటీగా మహేశ్ ఠాకూర్‌ను ఎంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఉత్తర్‌ప్రదేశ్‌లో 6 దశల్లో లోక్‌సభ పోలింగ్ జరగనుంది. అక్కడ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతాయి. ఫలితాలు మే 23న వెలువడతాయి. -
అంతకుముందే డేట్స్ ఇచ్చేశాను..
మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో భారీ స్థాయిలో హింసచెలరేగిన తర్వాత స్థానిక ఎంపీ, బాలీవుడ్ నటి హేమమాలిని తీరుపై తీవ్ర విమర్శలు రావడం, బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గురువారం రాత్రి మథుర ఘటన జరగగా.. శుక్రవారం ఉదయం తనకు తెలిసిందని హేమమాలిని చెప్పారు. మథురకు వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక మథుర అల్లర్లతో అట్టుడికిపోతుంటే, అదే సమయంలో హేమమాలిని షూటింగ్లో పాల్గొని ఆ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై వచ్చిన విమర్శలపైనా ఆమె స్పందించారు. 'నేనొక నటి. షూటింగ్‌కు అంతకుముందే డేట్స్ ఇచ్చాను. గురువారం రాత్రి జరిగిన ఘటన ఊహించనిది' అంటూ హేమమాలిని ట్వీట్ చేశారు. మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 24 మంది మరణించారు. మరణించినవారిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. మథుర ఎంపీ అయిన హేమమాలిని ఈ ఘటనపై స్పందించకుండా, ఒక సినిమా షూటింగులో ఆమె పాల్గొన్నప్పటి ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మథుర కాలిపోతుంటే ఈ సంబరాలు ఏంటంటూ నెటిజెన్లు నిలదీశారు. ఆ తర్వాత హేమ మాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేశారు. -
నాలుక కరుచుకున్న హేమ
ఒకవైపు తన లోక్‌సభ నియోజకవర్గం అంతా అట్టుడుకుతుంటే.. తీరిగ్గా షూటింగ్ ఫొటోలు పెడతారా అంటూ విమర్శలు రావడంతో బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమ మాలిని నాలుక కరుచుకున్నారు. విషయం ఏమిటంటే.. మథురలో అక్రమ కట్టడాలను తొలగించే విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 21 మంది మరణించారు. మరణించినవారిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఒక సినిమా షూటింగులో పాల్గొంటున్న మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు. ఒక లాంచీ ఎక్కుతున్న ఫొటోలు మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దాంతో వెంటనే ట్విట్టర్ విమర్శలతో మోతెక్కిపోయింది. మథుర కాలిపోతుంటే ఈ సంబరాలు ఏంటంటూ నిలదీశారు. వెంటనే మేల్కొన్న హేమ మాలిని.. ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేసేశారు. అయితే.. ఈ విషయంలో అటు హేమమాలినికి వ్యతిరేకంగా, మద్దతుగా రెండువైపులా కూడా ట్వీట్లు వెల్లువెత్తాయి.