ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య స్థానిక, స్థానికేతర అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని స్థానికతను టార్గెట్ చేస్తూ మథుర పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ ధంగర్ ఇటీవల విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ హేమామలిని మథురకు స్థానికురాలు కాదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత విమర్శలపై తాజాగా మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలిని ఓ జాతీయ మీడియా ఇంటర్య్వూలో పాల్గొని మాట్లాడారు.
‘నేను గత పదేళ్లుగా మథురలో స్థానికురాలిని. శ్రీకృష్ణ భగవానుడికి భక్తురాలుగా నేను ఇక్కడ స్థానికురాలినే. నేను ఇక్కడి ఎంపీగా పలు సేవలు అందించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అందుకే నేను ఇక్కడి వ్యక్తినే. నన్న మీరు(కాంగ్రెస్ నేతలు) స్థానికేతర వ్యక్తిగా భావించినా.. స్థానికేతర వ్యక్తిగానే బాగా సేవలు అందిచగలరని నమ్ముతా. స్థానికులుగా ఇక్కడే ఉండే వారికి ఈ ప్రాంత మంచి, చెడు తెలియదు. వారు ఇక్కడి పరిస్థితులను మెరుగ్గా మార్చాలనుకోరు. స్థానికేతరులు మాత్రం అలా కాదు.. ఎందుకంటే బయటినుంచి వచ్చినవారికి చాలా అనుభవాలు ఉంటాయి.
అందుకే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. నేను ఒక ఎంపీగా... కేంద్రంలోని మంత్రుల సాయంతో మథురలో చాలా అభివృద్ధి పనులు చేశాను. నేను ఒక ఎంపీగా నా పదవి మచ్చ తీసుకురాలేను. ఒక ఎంపీగా సరైనా సేవలు అందిస్తే.. ప్రతి నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. నేను ఈ ప్రాంతానికి మంచి చేయటం కోసం ముంబై నుంచి మథుర ఎనిమిది గంటలు ప్రయాణిస్తాను.
లెక్కలేనన్ని సార్లు ముంబై- మథుర వస్తూ ఉంటా.. ఎందుకంటే నాకు మథుర ప్రాంతానికి మంచి చేయాలనే తపన ఉంటుంది’ అని ఎంపీ హేమమాలిని అన్నారు. ఇప్పటికే మథుర నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందని హేమమాలినికి బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సైతం మారోమారు అవకాశం ఇచ్చింది.
హేమమాలిని స్థానికురాలు కాదని.. తాను స్థానికుడనని ఈసారి ఎన్నికల్లో మథురలో తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ ధంగర్ ప్రజలను కోరుతున్నారు. ఇక..మొదటిసారి 2014 సార్వత్రిక ఎన్నికలో బీజేపీ తరఫు హేమమాలిని పోటీ చేసీ సమీప రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డీ) అభ్యర్థి జయంత్ చౌదరీ ఓడించారు. సుమారు 3 లక్షల భారీ మేజార్టీతో హేమమాలిని గెలుపొందారు. 2019లో సైతం సమీప ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి కున్వర్ నరేంద్రపై హేమమాలిని 2,93,471 మేజార్టీతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment