
'డ్రీమ్ గాల్'ను తలుచుకున్న మాజీ సీఎం
బిహార్ రహదారులను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నున్నగా తయారుచేస్తానని గతంలో ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి 'డ్రీమ్ గాల్'ను తలుచుకున్నారు.
పాట్నా: బిహార్ రహదారులను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నున్నగా తయారుచేస్తానని గతంలో ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి 'డ్రీమ్ గాల్'ను తలుచుకున్నారు. బిహార్ బీజేపీ హేమమాలిని కూడా కాపాడలేరని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. 'హేమమాలినితో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటే బీజేపీ పప్పులో కాలేసినట్టే' అని లాలూ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున హేమమాలిని స్టార్ కాంపైనర్ గా కొనసాగుతున్నారు.
కాగా, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందని లాలూ ఆరోపించారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో ఏకీభవిస్తున్నారో, లేదో బీజేపీ నాయకులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.